PM Modi : ఉక్రెయిన్, బంగ్లా పరిస్థితులపై జోబైడెన్ తో మాట్లాడిన మోదీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఫోన్ లో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో పరిస్థితులు సహా ఆయా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సమగ్రంగా చర్చించినట్లు ‘ఎక్స్’ వేదికగా ఆయన తెలిపారు. యుద్ధభూమిలో వీలైనంత త్వరగా స్థిరత్వం, శాంతిస్థాపన దిశగా భారత్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. బంగ్లాదేశ్ పరిస్థితులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బంగ్లాలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రత, త్వరగా సాధారణ స్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని చాటిచెప్పినట్లు తెలిపారు. అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో మోదీ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి, క్వాడ్ సహా ఆయా వేదికలపై సహకారాన్ని సమీక్షించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ ఇటీవల పోలండ్, ఉక్రెయిన్లలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్- రష్యాల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు.. వచ్చే నెలలో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ వెళ్లనున్నారు. సెప్టెంబరు 22న అక్కడి లాంగ్ ఐలండ్‌లో భారత సంతతి వారిని ఉద్దేశించి, అనంతరం సెప్టెంబరు 26న ఐరాస జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

What's Your Reaction?