Polygraph Test: పాలిగ్రాఫ్ టెస్ట్ పొంతన లేని సమాధానాలు చెప్పిన కోల్కత్త నిందితుడు సంజయ్రాయ్
తాను చూసేసరికే లేడీ డాక్టర్ మరణించిందని చెప్పిన సంజయ్
కోల్‌కతాలో ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ వైద్యురాలిని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాని నిందితుడు సంజయ్ రాయ్‌కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఈ టెస్టులో సంచలన విషయం వెలుగుచూసినట్టు తెలిసింది. తాను సెమినార్ హాల్లోకి వెళ్లేసరికే ఆమె మరణించినట్టు ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఇటీవల కోర్టుకు చెప్పిన నిందితుడు.. ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్టులో కూడా ఇలాగే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పాలిగ్రాఫ్ పరీక్షలో అనేక తప్పుడు, నమ్మశక్యం కాని సమాధానాలు వచ్చినట్టు తెలిసింది. ఈ పరీక్షకు హాజరైన నిందితుడు ఆందోళనగా కనిపించినట్టు తెలిసింది. తాను సెమినార్ రూములో అడుగుపెట్టే సరికే వైద్యురాలు మృతిచెంది కనిపించిందని, దీంతో తాను భయంతో పారిపోయానని చెప్పినట్టు సమాచారం.
వైద్యురాలిపై హత్యాచారం తర్వాత అరెస్ట్ అయిన సంజయ్రాయ్ తొలుత నేరాన్ని అంగీకరించాడు. అయితే, ఇటీవల మాత్రం యూటర్న్ తీసుకున్నాడు. తాను అమాయకుడినని, తనను ఉద్దేశపూర్వకంగా ఇందులో ఇరికించారని వాపోయాడు. అసలు ఆమెపై అత్యాచారం, హత్య జరిగిన విషయం కూడా తనకు తెలియదని జైలు గార్డ్స్‌తో చెప్పినట్టు కూడా తెలిసింది. ఇదే విషయాన్ని గత శుక్రవారం సీల్దాలోని అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఎదుట కూడా చెప్పాడు. అయితే, అతడు దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడని అధికారి ఒకరు తెలిపారు.
అలాగే హత్య జరిగిన రోజు రెండు రెడ్‌లైట్ ఏరియాల్లో తిరిగినట్లు అతను చెప్పాడు. కానీ శృంగారంలో పాల్గొనలేదని తెలిపాడు. ఓ వీధిలో ఓ మహిళను వేధించినట్లు పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. ఈ ఘటన నిఘా కెమెరాలకు కూడా దొరికింది. ఆ రోజునే తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడినట్లు కూడా సంజయ్ చెప్పాడు. ఆమె నగ్న ఫోటోల కోసం సంజయ్ అడినట్లు వెల్లడైంది.
What's Your Reaction?