Prabhas and Allu Arjun : ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం

రెబల్ స్టార్ ప్రభాస్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఎప్పుడూ విభేదాలు కనిపించలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా పోటీ పడలేదు. బట్ సడెన్ గా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఒక సోషల్ మీడియా వార్ స్టార్ట్ అయింది. అది కూడా మామూలుగా కాదు. ఈ హీరోల కెరీర్ మొదట్నుంచి జరిగిన అంశాలను బయటకు తీసుకు వచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. మామూలుగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాంటి విషయాల్లో చాలా ముందుంటారు. ఈ సారి కూడా అదే రేంజ్ లో ప్రభాస్ పై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో అతను విపరీతంగా సిగరెట్స్ తాగుతాడనీ, మందేస్తాడనీ.. అమ్మాయిల పిచ్చి ఉందని చెబుతూ.. ఆయా అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదంతా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగుతారా.. వాళ్లూ తగులుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నాడు.. మెగా ఫ్యామిలీకి ఎలా వెన్నుపోటు పొడిచాడు.. పెద్దలను గౌరవించడు, ఆడవాళ్ల గురించి పబ్లిక్ లోనే చులకనగా మాట్లాడతాడు అంటూ ఆ ఫోటోస్, వీడియోస్ ను వీళ్లూ పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా అతను అమ్మాయిలను డిస్ రెస్పెక్ట్ చేసినట్టుగా చూపుతూ ఉన్న ఫోటోస్ హైలెట్ అవుతున్నాయి. పైగా తన సినిమాలకు సంబంధించి ఫేక్ కలెక్షన్స్ ను ఇతనే క్రియేట్ చేయిస్తాడు అనే కౌంటర్స్ కూడా ఉన్నాయి. మొన్నటి వరకూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచింది. ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. మరి ఇది ఎంత దూరం పోతుందో కానీ.. లేటెస్ట్ గానే నాని ఇలాంటి అంశాలను ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ ను మేం(హీరోలు) అస్సలు పట్టించుకోం అన్నాడు. అందువల్ల ఇదంతా అభిమానుల ఆయాసం తప్ప ఇంకేం కాదు.  

Aug 28, 2024 - 17:07
 0  2
Prabhas and Allu Arjun :
ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం

రెబల్ స్టార్ ప్రభాస్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఎప్పుడూ విభేదాలు కనిపించలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా పోటీ పడలేదు. బట్ సడెన్ గా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఒక సోషల్ మీడియా వార్ స్టార్ట్ అయింది. అది కూడా మామూలుగా కాదు. ఈ హీరోల కెరీర్ మొదట్నుంచి జరిగిన అంశాలను బయటకు తీసుకు వచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. మామూలుగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాంటి విషయాల్లో చాలా ముందుంటారు. ఈ సారి కూడా అదే రేంజ్ లో ప్రభాస్ పై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో అతను విపరీతంగా సిగరెట్స్ తాగుతాడనీ, మందేస్తాడనీ.. అమ్మాయిల పిచ్చి ఉందని చెబుతూ.. ఆయా అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇదంతా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగుతారా.. వాళ్లూ తగులుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నాడు.. మెగా ఫ్యామిలీకి ఎలా వెన్నుపోటు పొడిచాడు.. పెద్దలను గౌరవించడు, ఆడవాళ్ల గురించి పబ్లిక్ లోనే చులకనగా మాట్లాడతాడు అంటూ ఆ ఫోటోస్, వీడియోస్ ను వీళ్లూ పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా అతను అమ్మాయిలను డిస్ రెస్పెక్ట్ చేసినట్టుగా చూపుతూ ఉన్న ఫోటోస్ హైలెట్ అవుతున్నాయి. పైగా తన సినిమాలకు సంబంధించి ఫేక్ కలెక్షన్స్ ను ఇతనే క్రియేట్ చేయిస్తాడు అనే కౌంటర్స్ కూడా ఉన్నాయి. మొన్నటి వరకూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచింది. ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. మరి ఇది ఎంత దూరం పోతుందో కానీ.. లేటెస్ట్ గానే నాని ఇలాంటి అంశాలను ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ ను మేం(హీరోలు) అస్సలు పట్టించుకోం అన్నాడు. అందువల్ల ఇదంతా అభిమానుల ఆయాసం తప్ప ఇంకేం కాదు.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News