Priyadarshi :ప్రిదయర్శి సినిమా వేణు స్వామిపై సెటైరా..?

Priyadarshi :ప్రిదయర్శి సినిమా వేణు స్వామిపై సెటైరా..? జాతకం.. చాలామంది మేం నమ్మం అంటారు కానీ.. జాతకం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ జీవితంలో రేపు ఏం జరుగుతుంది...? అనేది తెలుసుకోవాలని.. అది మంచే అయి ఉండాలని కూడా కోరుకుంటారు. ఇలాంటి వారి ఆలోచన, కొందరి మానసిక బలహీనతలను అడ్డు పెట్టుకొని జాతకాలు చెప్పడాన్ని వ్యాపారంగా మలచుకున్నారు చాలామంది. అలాంటి వారిలో వేణుస్వామి ఒకడు. నిజానికి అతను మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉన్నాడు. దేనికైనా టైమ్ రావాలి అంటారు కదా. అది ఇప్పుడు వచ్చింది. నాగచైతన్య, శోభిత విడిపోతారని చెప్పి సోషల్ మీడియాలో సెంటర్ పాయింట్ అయ్యి ఇప్పుడు ఏకంగా కేస్ లే ఫేస్ చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి కథతో సినిమా వస్తే అటు ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా యాడ్ చేయొచ్చు కదా. ఆలోచన అదేనా కాదా అని చెప్పలేం కానీ.. ప్రియదర్శి హీరోగా జాతకాల నేపథ్యంలో ఒక సినిమా వస్తోంది. సినిమా టైటిల్ 'సారంగపాణి జాతకం'. రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తుండటం విశేషం. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే వేణు స్వామి లాంటి వారి వల్ల ఇబ్బందులు పడ్డ ఓ కుర్రాడి జీవిత కథతో రూపొందినట్టుగా ఉందీ లుక్. సో.. వేణుస్వామి లాంటి జాతకాలు చెప్పే చాలామందిపై ఇంద్రగంటి మార్క్ సెటైర్స్ కూడా ఉంటాయనుకోవచ్చు. ప్రియదర్శి లుక్ బావుంది. బలగం తర్వాత ప్రియదర్శి హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డార్లింగ్ పోయినా అతనికి ఇబ్బందేం లేదు అన్నట్టుగానే ఉంది సిట్యుయేషన్. ఈ తరహా మీడియం రేంజ్ ఎంటర్టైన్మెంట్స్ తో వస్తే మాగ్జిమం ఆకట్టుకునే అవకాశాలున్నాయి.

Aug 25, 2024 - 23:06
Aug 25, 2024 - 23:14
 0  1
Priyadarshi :ప్రిదయర్శి సినిమా వేణు స్వామిపై సెటైరా..?

జాతకం.. చాలామంది మేం నమ్మం అంటారు కానీ.. జాతకం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ జీవితంలో రేపు ఏం జరుగుతుంది...? అనేది తెలుసుకోవాలని.. అది మంచే అయి ఉండాలని కూడా కోరుకుంటారు. ఇలాంటి వారి ఆలోచన, కొందరి మానసిక బలహీనతలను అడ్డు పెట్టుకొని జాతకాలు చెప్పడాన్ని వ్యాపారంగా మలచుకున్నారు చాలామంది. అలాంటి వారిలో వేణుస్వామి ఒకడు. నిజానికి అతను మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉన్నాడు. దేనికైనా టైమ్ రావాలి అంటారు కదా. అది ఇప్పుడు వచ్చింది. నాగచైతన్య, శోభిత విడిపోతారని చెప్పి సోషల్ మీడియాలో సెంటర్ పాయింట్ అయ్యి ఇప్పుడు ఏకంగా కేస్ లే ఫేస్ చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి కథతో సినిమా వస్తే అటు ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా యాడ్ చేయొచ్చు కదా. ఆలోచన అదేనా కాదా అని చెప్పలేం కానీ.. ప్రియదర్శి హీరోగా జాతకాల నేపథ్యంలో ఒక సినిమా వస్తోంది. సినిమా టైటిల్ 'సారంగపాణి జాతకం'. రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తుండటం విశేషం. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే వేణు స్వామి లాంటి వారి వల్ల ఇబ్బందులు పడ్డ ఓ కుర్రాడి జీవిత కథతో రూపొందినట్టుగా ఉందీ లుక్. సో.. వేణుస్వామి లాంటి జాతకాలు చెప్పే చాలామందిపై ఇంద్రగంటి మార్క్ సెటైర్స్ కూడా ఉంటాయనుకోవచ్చు. ప్రియదర్శి లుక్ బావుంది. బలగం తర్వాత ప్రియదర్శి హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డార్లింగ్ పోయినా అతనికి ఇబ్బందేం లేదు అన్నట్టుగానే ఉంది సిట్యుయేషన్. ఈ తరహా మీడియం రేంజ్ ఎంటర్టైన్మెంట్స్ తో వస్తే మాగ్జిమం ఆకట్టుకునే అవకాశాలున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News