Priyadarshi : జాతకాలు చెప్పనున్న ప్రియదర్శి
టాలీవుడ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, యాక్టర్ ప్రియదర్శి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆదివారం ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మూవీ టీమ్ ప్రకటించింది. ప్రియదర్శికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేసింది. ప్రియదర్శి జాతకాలు చెప్పే క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై గతంలో వచ్చిన జెంటిల్ మెన్, సమ్మోహనం సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియదర్శితో తీయబోతున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సీనియర్ నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

What's Your Reaction?