Pushpa 2: The Rule: తొక్కిసలాటలో మహిళ ప్రాణం తీసిన పుష్ప బెన్ ఫిట్ షో

Pushpa 2: The Rule: తొక్కిసలాటలో మహిళ ప్రాణం తీసిన పుష్ప బెన్ ఫిట్ షో

Dec 5, 2024 - 10:38
Dec 5, 2024 - 11:07
 0  7
Pushpa 2: The Rule:  తొక్కిసలాటలో మహిళ ప్రాణం తీసిన పుష్ప బెన్ ఫిట్ షో

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌కు హీరో అల్లు అర్జున్‌ వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ బాలుడు, మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి(35) మృతి చెందింది.

పోలీసుల లాఠీ ఛార్జ్!

‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్‌ షోకు ముందు నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ ప్రీమియర్ షో చూసేందుకు బన్నీ తన ఫ్యామిలీతో సంధ్య థియేటర్‌కు రావడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకి తరలివచ్చారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆయన వాహనం దగ్గరకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అభిమానులు భారీగా ఉండడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. ఈ తొక్కిసలాటలోనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యలు తెలిపారు.

సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు

హైదరాబాద్ సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 సినిమా బెన్ ఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెన్ ఫిట్ షో సందర్భంగా యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని గుర్తించారు. సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

మహిళ మృతిపై ఆగ్రహావేశాలు

పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి మహిళ మరణించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్టార్ హీరో వస్తున్నాడని తెలిసీ పోలీసులు, థియేటర్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ మహిళ మరణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

పుష్ప 2 పోస్టర్‌లో వైఎస్ జగన్

పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదే సమయంలో పుప్ప 2కి పొలిటికల్ రంగు అంటుకుని పోస్టర్లు వెలిశాయి. అనంతపురం జిల్లా గుత్తిలోని KPS మూవీ థియేటర్ వద్ద పుష్ప పోస్టర్‌లో జగన్ ఫొటోలు కనిపించాయి. అంతేకాక పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కనిపించాయి. ఇదే సమయంలో మరికొందరు చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్, చిరంజీవి ఉన్న పోస్టర్లను కూడా అతికించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News