Rahul Gandhi: మరోసారి రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్

20-30 ఏళ్లుగా పెళ్లి ఒత్తిడి నుంచి బయటకు వచ్చానని ఆసక్తికర వ్యాఖ్య

Aug 27, 2024 - 07:47
 0  5
Rahul Gandhi: మరోసారి రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన,  ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్

జమ్మూకశ్మీర్‌లో తన పెళ్లిపై రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని, అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు. 20-30 ఏళ్లుగా పెళ్లి ఒత్తిడి నుంచి బయటకు వచ్చానని కూడా రాహుల్ అన్నారు. గత వారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన సందర్భంగా కశ్మీరీ యువతులతో రాహుల్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీ అమ్మాయిల బృందంతో జరిగిన ఈ సంభాషణ వీడియోను సోమవారం తన యూట్యూబ్ ఛానెల్‌, ఎక్స్ లో అప్‌లోడ్ చేశారు.

కాశ్మీర్‌ పర్యటనలో భాగంగా కశ్మీర్ కి చెందిన యువతులతో రాహుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా అమ్మాయిలు పెళ్లి ప్రణాళికల గురించి రాహుల్ ని ప్రశ్నించారు. “నేను పెళ్లికి ప్లాన్ చేయడం లేదు. కానీ అది జరిగితే అది (మంచిది) . 20-30 సంవత్సరాల వివాహ ఒత్తిడి అధిగమించా.” అని పేర్కొన్నారు. తన పెళ్లికి తప్పకుండా ఆహ్వానిస్తానని కశ్మీర్ యువతులకు రాహుల్ హామీ ఇచ్చారు.

దీంతో పాటు జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఆయన మరోసారి లేవనెత్తారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి నడిపించడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రశ్నించగా.. ‘ఎవరి మాటా వినకపోవడమే ప్రధానమంత్రితో నా సమస్య’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. భారతీయ చరిత్రలో ఒక రాష్ట్రానికి పూర్తి రాష్ట్ర హోదాను తొలగించడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ విధానం తనకు నచ్చలేదన్నారు. కానీ ఇప్పుడు మనం మన హోదాను తిరిగి పొందాలని ముఖ్యమన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News