Rains in Telangana : తెలంగాణలో మూడు రోజులు వానలు
తెలంగాణను వర్షాలు వీడటం లేదు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున తీరం దాటింది. అనంతరం నట్లు వెల్లడించారు. అది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. హైదారాబాద్‌లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి వర్షం కురిసే అకాశం ఉందన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ మేయర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణను వర్షాలు వీడటం లేదు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున తీరం దాటింది. అనంతరం నట్లు వెల్లడించారు. అది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
ఇవాళ మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
హైదారాబాద్‌లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి వర్షం కురిసే అకాశం ఉందన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ మేయర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
What's Your Reaction?