Rajasekhar : పవర్ ఫుల్ టైటిల్ తో మళ్లీ వస్తోన్న రాజశేఖర్
90ల్లో రాజశేఖర్ సినిమా అంటే మెగాస్టార్ కు ఉన్నంత ఓపెనింగ్స్ ఉండేవి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అతనికి. 2000ల తర్వాత మెల్లగా అతని క్రేజ్ తగ్గింది. లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకున్నారు. బట్ గరుడవేగతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అతని ఇమేజ్ ను అద్భుతంగా వాడుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కమర్షియల్ గానూ గరుడవేగ పెద్ద హిట్ అయింది. కానీ తర్వాత చేసిన కల్కి, శేఖర్ సినిమాలు రాజశేఖర్ ను మళ్లీ డిజప్పాయింట్ చేశారు. మధ్యలో కోవిడ్ బారిన పడ్డాడు. కోలుకున్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రార్డినరీ మేన్ లో పోలీస్ గా కనిపించాడు. బట్ ఈ పాత్ర, ఆ సినిమా రెండూ డిజాస్టర్ అనిపించుకున్నాయి. దీంతో ఇక రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికి రాడు అనే కమెంట్స్ వచ్చాయి. కానీ అవి నిజం కాదు. ఈ యాంగ్రీమేన్ మళ్లీ వస్తున్నాడు.ఈ సారి పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు రాజశేఖర్. ఈ మూవీ టైటిల్ ‘మగాడు’. పవన్ సాధినేని దర్శకుడు. ఇదే టైటిల్ తో 90ల్లో అతనే హీరోగా ఓసినిమాలో నటించాడు. ఆ టైటిల్ ను రిపీట్ చేస్తూ.. మరోసారి హీరోగానే రాబోతున్నాడు రాజశేఖర్. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి. విశేషం ఏంటంటే.. 1990లో విడుదలైన మగాడు సినిమా అప్పట్లో యావరేజ్ గానే నిలిచింది. సినిమా సగం తర్వాత హీరో ఎంట్రీ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అన్నారు అప్పటి విశ్లేషకులు. బట్ రాజశేఖర్ కు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.
90ల్లో రాజశేఖర్ సినిమా అంటే మెగాస్టార్ కు ఉన్నంత ఓపెనింగ్స్ ఉండేవి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అతనికి. 2000ల తర్వాత మెల్లగా అతని క్రేజ్ తగ్గింది. లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకున్నారు. బట్ గరుడవేగతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అతని ఇమేజ్ ను అద్భుతంగా వాడుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కమర్షియల్ గానూ గరుడవేగ పెద్ద హిట్ అయింది. కానీ తర్వాత చేసిన కల్కి, శేఖర్ సినిమాలు రాజశేఖర్ ను మళ్లీ డిజప్పాయింట్ చేశారు. మధ్యలో కోవిడ్ బారిన పడ్డాడు. కోలుకున్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రార్డినరీ మేన్ లో పోలీస్ గా కనిపించాడు. బట్ ఈ పాత్ర, ఆ సినిమా రెండూ డిజాస్టర్ అనిపించుకున్నాయి. దీంతో ఇక రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికి రాడు అనే కమెంట్స్ వచ్చాయి. కానీ అవి నిజం కాదు. ఈ యాంగ్రీమేన్ మళ్లీ వస్తున్నాడు.
ఈ సారి పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు రాజశేఖర్. ఈ మూవీ టైటిల్ ‘మగాడు’. పవన్ సాధినేని దర్శకుడు. ఇదే టైటిల్ తో 90ల్లో అతనే హీరోగా ఓసినిమాలో నటించాడు. ఆ టైటిల్ ను రిపీట్ చేస్తూ.. మరోసారి హీరోగానే రాబోతున్నాడు రాజశేఖర్. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.
విశేషం ఏంటంటే.. 1990లో విడుదలైన మగాడు సినిమా అప్పట్లో యావరేజ్ గానే నిలిచింది. సినిమా సగం తర్వాత హీరో ఎంట్రీ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అన్నారు అప్పటి విశ్లేషకులు. బట్ రాజశేఖర్ కు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.
What's Your Reaction?