Rashmika Mandanna :దెయ్యాల దారిలో రష్మిక మందన్నా

ఒకప్పుడు హారర్ మూవీస్ అంటే కేవలం భయాన్ని కలిగించడం లేదంటే రివెంజ్ తీర్చుకునే దెయ్యాలే ఎక్కువగా కనిపించాయి. కానీ ట్రెండ్ మారింది. దెయ్యాలు నవ్విస్తున్నాయి. సెంటిమెంట తో ఏడిపిస్తున్నాయి. ఈ రెండూ కరెక్ట్ గా వర్కవుట్ అయితే కాసుల వర్షం కూడా కురిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న బాలీవుడ్ కే కొత్త కళ తెచ్చింది ఒక దెయ్యం సినిమా. స్త్రీ 2. ఏకంగా ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అంతా చూస్తే ఆ సినిమా బడ్జెట్ 50 కోట్లు కూడా లేదు. అంటే ఆ దెయ్యం ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పక్కర్లేదు కదా. అందుకే రష్మిక మందన్నా కూడా ఓ దెయ్యం కథకు ఓకే చెప్పిందట.ఇది కూడా బాలీవుడ్ లోనే రూపొందబోతోన్న సినిమా. సౌత్ లోని హంపి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. హంపి అనగానే విజయనగర రాజుల చరిత్ర కనిపిస్తుంది కదా. ఈ కథ కూడా అక్కడి నుంచే మొదలవుతుందట. అప్పటి నుంచి ఈ కాలం వరకూ సాగే కథనంలో అనేక ట్విస్ట్ లు, బ్యాక్ డ్రాప్ లూ కనిపించబోతున్నాయనీ.. ఈ అన్ని వేరియేషన్స్ లో రష్మిక మందన్న పాత్ర ఉంటుందని టాక్. ఇప్పటికైతే ఇంకా అఫీషియల్ గా న్యూస్ బయటకు రాలేదు కానీ.. ఈ చిత్రాన్ని ఆదిత్య సర్పోత్ దార్ డైరెక్ట్ చేస్తాడు అంటున్నారు. ఇతను ఎక్కువగా మరాఠీ మూవీస్ తో ఫేమస్. రీసెంట్ గా బాలీవుడ్ లోనే ముంజ్యా అనే హారర్ మూవీతో మెప్పించాడు. అతనే ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు అంటున్నారు. ఇక రష్మిక తెలుగుతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. తన చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలున్నాయి. పుష్ప 2, కుబేర మూవీస్ తో పాటు బాలీవుడ్ నుంచి ఛావా అనే మూవీ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. మొత్తంగా రష్మిక చేయబోతోన్న ఫస్ట్ హారర్ మూవీ ఇది. మరి తనకు ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి. 

Aug 29, 2024 - 22:00
Aug 29, 2024 - 22:08
 0  4
Rashmika Mandanna :దెయ్యాల దారిలో రష్మిక మందన్నా

ఒకప్పుడు హారర్ మూవీస్ అంటే కేవలం భయాన్ని కలిగించడం లేదంటే రివెంజ్ తీర్చుకునే దెయ్యాలే ఎక్కువగా కనిపించాయి. కానీ ట్రెండ్ మారింది. దెయ్యాలు నవ్విస్తున్నాయి. సెంటిమెంట తో ఏడిపిస్తున్నాయి. ఈ రెండూ కరెక్ట్ గా వర్కవుట్ అయితే కాసుల వర్షం కూడా కురిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న బాలీవుడ్ కే కొత్త కళ తెచ్చింది ఒక దెయ్యం సినిమా. స్త్రీ 2. ఏకంగా ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అంతా చూస్తే ఆ సినిమా బడ్జెట్ 50 కోట్లు కూడా లేదు. అంటే ఆ దెయ్యం ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పక్కర్లేదు కదా. అందుకే రష్మిక మందన్నా కూడా ఓ దెయ్యం కథకు ఓకే చెప్పిందట.

ఇది కూడా బాలీవుడ్ లోనే రూపొందబోతోన్న సినిమా. సౌత్ లోని హంపి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. హంపి అనగానే విజయనగర రాజుల చరిత్ర కనిపిస్తుంది కదా. ఈ కథ కూడా అక్కడి నుంచే మొదలవుతుందట. అప్పటి నుంచి ఈ కాలం వరకూ సాగే కథనంలో అనేక ట్విస్ట్ లు, బ్యాక్ డ్రాప్ లూ కనిపించబోతున్నాయనీ.. ఈ అన్ని వేరియేషన్స్ లో రష్మిక మందన్న పాత్ర ఉంటుందని టాక్. ఇప్పటికైతే ఇంకా అఫీషియల్ గా న్యూస్ బయటకు రాలేదు కానీ.. ఈ చిత్రాన్ని ఆదిత్య సర్పోత్ దార్ డైరెక్ట్ చేస్తాడు అంటున్నారు. ఇతను ఎక్కువగా మరాఠీ మూవీస్ తో ఫేమస్. రీసెంట్ గా బాలీవుడ్ లోనే ముంజ్యా అనే హారర్ మూవీతో మెప్పించాడు. అతనే ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు అంటున్నారు.

ఇక రష్మిక తెలుగుతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. తన చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలున్నాయి. పుష్ప 2, కుబేర మూవీస్ తో పాటు బాలీవుడ్ నుంచి ఛావా అనే మూవీ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. మొత్తంగా రష్మిక చేయబోతోన్న ఫస్ట్ హారర్ మూవీ ఇది. మరి తనకు ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News