Raviteja : అప్పుడే ఓటిటిలోకి మిస్టర్ బచ్చన్..

మాస్ మహరాజ్ అన్న పేరుకు రిపేర్ వచ్చే న్యూస్ ఇది. ఇకపై అతని ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమం గ్యారెంటీ హీరో కాదు అనే మాట ఖచ్చితంగా చెప్పుకునే మాట. అతనితో సినిమా చేస్తే రెమ్యూనరేషన్ ఫుల్.. రెవిన్యూ నిల్ అనేది మరోసారి డిక్లేర్ అయిన సందర్భం. యస్.. ఇదంతా రవితేజ గురించే. అతనితో పాటు అతని లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ గురించి కూడా. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలైంది. ప్రీమియర్స్ వేయడంతో రిలీజ్ కు ముందు రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతోమినిమం ఓపెనింగ్స్ కూడా లేవు. కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. అయినా అగ్రిమెంట్స్ వల్ల థియేటర్స్ లోనే ఉంచారు. కొన్ని చోట్ల మాత్రం బచ్చన్ ను తీసేసి ఆయ్, కమిటీ కుర్రోళ్లు లాంటి చిన్న సినిమాలు వేసుకున్నారంటే రవితేజ మూవీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా ఇది పరాభవం అనే చెప్పాలి.32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయింది మిస్టర్ బచ్చన్. బట్ రెండు వారాల తర్వాత కూడా ఈ మూవీ కేవలం 7కోట్లకు పైగా మాత్రమే వసూలు చేసింది. 25 కోట్ల వరకూ నష్టం కన్ఫార్మ్ అయిందనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. తన రెమ్యూనరేషన్ కూడా 25 కోట్లకు తగ్గొద్దు అంటాడు రవితేజ. మరి అంత పారితోషికం తీసుకునే హీరోకు అంతకు మించిన మార్కెట్ ఉండాలి కదా. చూస్తే మూడో వంతు కూడా వసూలు చేయలేకపోయాడు. ఇదే దారుణం అంటే అసలైన ప్రాబ్లమ్ మరోటి వచ్చింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ 45 రోజుల తర్వాతే ఓటిటిలో విడుదల చేయాలనే రూల్ ఉంది. బట్ మనోళ్లు ఆ రూల్ ను ఎప్పుడూ ఫాలో కారు. కాకపోతే చిన్న హీరోల సినిమాలు అలా చేస్తాయి. బట్ రవితేజ లాంటి పెద్ద హీరో మూవీ ఓవైపు థియేటర్స్ లో పూర్ కలెక్షన్స్ తో ఉండగానే ఓటిటిలోకి వచ్చేస్తోంది. అదీ రిలీజ్ అయిన నెల రోజుల్లోపే. సెప్టెంబర్ 12 నుంచి మిస్టర్ బచ్చన్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుందంటున్నారు. న్యూస్ ఇంకా కన్ఫర్మ్ కావాలి. బట్.. రవితేజ సినిమాకు ఓటిటిలో కూడా ఇదే టాక్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతని ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుంది.

Aug 26, 2024 - 20:05
 0  3
Raviteja : 
అప్పుడే ఓటిటిలోకి మిస్టర్ బచ్చన్..

మాస్ మహరాజ్ అన్న పేరుకు రిపేర్ వచ్చే న్యూస్ ఇది. ఇకపై అతని ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమం గ్యారెంటీ హీరో కాదు అనే మాట ఖచ్చితంగా చెప్పుకునే మాట. అతనితో సినిమా చేస్తే రెమ్యూనరేషన్ ఫుల్.. రెవిన్యూ నిల్ అనేది మరోసారి డిక్లేర్ అయిన సందర్భం. యస్.. ఇదంతా రవితేజ గురించే. అతనితో పాటు అతని లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ గురించి కూడా. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలైంది. ప్రీమియర్స్ వేయడంతో రిలీజ్ కు ముందు రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతోమినిమం ఓపెనింగ్స్ కూడా లేవు. కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. అయినా అగ్రిమెంట్స్ వల్ల థియేటర్స్ లోనే ఉంచారు. కొన్ని చోట్ల మాత్రం బచ్చన్ ను తీసేసి ఆయ్, కమిటీ కుర్రోళ్లు లాంటి చిన్న సినిమాలు వేసుకున్నారంటే రవితేజ మూవీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా ఇది పరాభవం అనే చెప్పాలి.

32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయింది మిస్టర్ బచ్చన్. బట్ రెండు వారాల తర్వాత కూడా ఈ మూవీ కేవలం 7కోట్లకు పైగా మాత్రమే వసూలు చేసింది. 25 కోట్ల వరకూ నష్టం కన్ఫార్మ్ అయిందనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. తన రెమ్యూనరేషన్ కూడా 25 కోట్లకు తగ్గొద్దు అంటాడు రవితేజ. మరి అంత పారితోషికం తీసుకునే హీరోకు అంతకు మించిన మార్కెట్ ఉండాలి కదా. చూస్తే మూడో వంతు కూడా వసూలు చేయలేకపోయాడు. ఇదే దారుణం అంటే అసలైన ప్రాబ్లమ్ మరోటి వచ్చింది.

థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ 45 రోజుల తర్వాతే ఓటిటిలో విడుదల చేయాలనే రూల్ ఉంది. బట్ మనోళ్లు ఆ రూల్ ను ఎప్పుడూ ఫాలో కారు. కాకపోతే చిన్న హీరోల సినిమాలు అలా చేస్తాయి. బట్ రవితేజ లాంటి పెద్ద హీరో మూవీ ఓవైపు థియేటర్స్ లో పూర్ కలెక్షన్స్ తో ఉండగానే ఓటిటిలోకి వచ్చేస్తోంది. అదీ రిలీజ్ అయిన నెల రోజుల్లోపే. సెప్టెంబర్ 12 నుంచి మిస్టర్ బచ్చన్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుందంటున్నారు. న్యూస్ ఇంకా కన్ఫర్మ్ కావాలి. బట్.. రవితేజ సినిమాకు ఓటిటిలో కూడా ఇదే టాక్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతని ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News