Realme Note 60 | 30న భారత్ మార్కెట్లోకి రియల్‌మీ నోట్ 60..ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme Note 60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme Note 60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత జనవరిలో ఆవిష్కరించిన రియల్‌మీ నోట్ 50 (Realme Note 50) ఫోన్ కొనసాగింపుగా రియల్‌మీ నోట్ 60 (Realme Note 60) వస్తోంది.
ఈ నెల 30న భారత్ మార్కెట్లో రియల్‌మీ నోట్ 60 ఫోన్ ఆవిష్కరిస్తుంది. అదే రోజు సేల్స్ ప్రారంభం అవుతాయి.రియల్‌మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ 32-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా తో వస్తోంది. 6.74 అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అండ్ రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ ఉంటుంది. మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
రియల్‌మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ ఆండాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ వర్షన్ పై పని చేస్తుంది. ఒక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. రియల్‌మీ నోట్ 50 (Realme Note 50) ఫోన్ యూనిసోక్ టీ612 ఎస్వోసీ ప్రాసెసర్ తో మార్కెట్లోకి వచ్చింది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లు – 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందీ ఫోన్.రియల్‌మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ తో వస్తోంది. వేర్వేరు సర్క్యులర్ యూనిట్లలో రెండు కెమెరా సెన్సర్లు ఉంటాయి. కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా ఉంటుంది.
What's Your Reaction?