Record-Level Rakhi Sales : రికార్డ్ స్థాయిలో రాఖీల సేల్స్

ఆన్ లైన్ ఆర్డర్స్ ద్వారా రాఖీలు,గిఫ్ట్‌లను డెలివరీ చేసిన క్విక్‌ కామర్స్‌ సంస్థలు రక్షా బంధన్ వేళ రికార్డ్ స్థాయిలో సేల్స్ నమోదు చేశాయి. బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సంస్థలు రికార్డ్ స్థాయిలో సేల్స్ ను నమోదు చేశాయి.రక్షాబంధన్‌ సందర్భంగా గతేడాది కంటే మెరుగైన అమ్మకాలు నమోదు చేసినట్లు బ్లింకిట్‌ ప్రకటించింది. ఒకరోజులో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయని బ్లింకిట్‌ సీఈవో అల్బీందర్‌ దిండ్సా పేర్కొన్నారు. సగటున నిమిషానికి 693 రాఖీలు అమ్మినట్లు తెలిపారు. చాక్లెట్‌ సేల్స్‌ కూడా విపరీతంగా పెరిగాయన్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా తమ సేవలపై ఉంచిన నమ్మకానికి గానూ కృతజ్ఞతలు తెలియజేశారు.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సైతం మెరుగైన అమ్మకాలు నమోదు చేసింది. రాఖీలతో పాటు సోదరుడికి గిఫ్ట్‌లు ఇచ్చే ఆనవాయితీ కారణంగా తమ ప్లాట్‌ఫామ్‌పై పర్ఫ్యూమ్‌ ఆర్డర్లు ఏకంగా 646 శాతం పెరిగినట్లు స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. చాక్లెట్ల తర్వాత అత్యధికంగా గిఫ్ట్‌లుగా ఇచ్చినవి ఇవేనని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ముంబయి నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, మంబయికి చెందిన ఓ వ్యక్తి రూ.11,320 విలువైన వస్తువులను తన సోదరికి రాఖీ గిఫ్ట్‌గా పంపించాడని తెలిపారు. అందులో బొమ్మలు, చాక్లెట్లతో పాటు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ లు ఉన్నట్లు చెప్పారు.

Aug 23, 2024 - 11:19
 0  3

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News