Revanth Reddy | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Revanth Reddy | హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్, పట్టణాలు, గ్రామాల్లో ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణపై ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు, కలెక్టర్ సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతిఒక్కరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
గోషామహల్‌లో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం సమీక్షించారు. భూబదలాయింపు ప్రక్రియ, డిజైన్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
What's Your Reaction?