RGV Director : RGV అరెస్టుకు రంగం సిద్ధం.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు
RGV Director : RGV అరెస్టుకు రంగం సిద్ధం.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు...
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్టుకు రంగం సిద్ధమైంది. RGV Director : RGV అరెస్టుకు రంగం సిద్ధం.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు . హైద రాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి ఏపీలోని మద్దిపాడు పోలీసులు వెళ్లారు. ఈక్రమంలో వర్మ నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. అయితే, వర్మ ఇంట్లో లేరని ఆయన సన్నిహితులు పోలీసులకు చెబుతు న్నట్టు తెలిసింది. ఆర్జీవీ ఎక్కడికి వెళ్లారనే విషయంపై వారు ఆరా తీస్తున్నారు. దీంతో అరెస్టు భయంతోనే ఆర్జీవీ అదృశ్యమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా..ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటికే పోలీసుల వి చారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు హైద రాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. రిప్లై ఇచ్చినా ఇంటికి రావడమేంటి? : అడ్వొకేట్ పోలీసులు ఆర్జీవీ ఇంటికి రావడంపై ఆయన అడ్వొకేట్ అభ్యంతరం తెలిపారు. 'రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. వాటికి మేం రిప్లై ఇచ్చాం. డిజిటల్ విచారణకు రెడీగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ విషయాన్ని డీఎ స్పీకి వాట్సాప్ ద్వారా తెలియజేశాం. అయినా పోలీసులు ఇంటి వరకు రావడం కరెక్ట్ కాదు. ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టు లో పెండింగ్లో ఉన్నాయి' అని వర్మ అడ్వొకే లో ట్ తెలిపారు.
What's Your Reaction?