Rishabh Pant | ‘పంత్‌కు ఆ 90 వేలు ఇచ్చేస్తున్నా’.. ఇంజనీరింగ్ స్టూడెంట్
Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఆటే కాదు మనసు కూడా బంగారమే. కష్టాల్లో ఎవరున్నా సరే చలించిపోయే పంత్ వెంటనే తనకు తోచిన సాయం చేస్తుంటాడు. అలా ఈ డాషింగ్ బ్యాటర్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి రూ.90 వేలు ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే..?
Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఆటే కాదు మనసు కూడా బంగారమే. కష్టాల్లో ఎవరున్నా సరే చలించిపోయే పంత్ వెంటనే తనకు తోచిన సాయం చేస్తుంటాడు. అలా ఈ డాషింగ్ బ్యాటర్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి రూ.90 వేలు ఇచ్చాడు. అంతేకాదు ‘నీ లక్ష్యాలను మర్చిపోకు. నీ కోసం దేవుడు ఎల్లప్పుడు మంచి ప్రణాళికలే వేస్తాడు’ అని ధైర్యం చెప్పాడు. అయితే.. సదరు విద్యార్ధి ఆ డబ్బులను మళ్లీ భారత స్టార్‌కు తిరిగి ఇచ్చేయనున్నాడు. ఎందుకో తెలుసా..?
సదరు ఇంజనీరింగ్ విధ్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ ఆడి రూ.90 వేలు కోల్పోయాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే తన సోషల్‌మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు. దాంతో, ఆన్‌లైన్‌లో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ‘పంత్‌ను నువ్వు మోసం చేశావు’ అంటూ అందరూ అతడిని తిట్టిపోశారు. దాంతో, బుద్ది వచ్చిన ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ పంత్‌కు ఆ రూ.90 వేలు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్.
కెరీర్ ప్రశ్నార్ధకం
రెండేండ్ల క్రితం జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్‌ను ప్రశ్నార్ధకం చేసింది. అయితే.. ఆ యాక్సిడెంట్ నుంచి మృత్యుంజయుడిలా బయటపడిన పంత్ మోకాలి సర్జరీ తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏ(NCA)లో కోలుకున్నాడు. కఠోర వ్యాయమాలు, నెట్స్‌లో గంటలకొద్దీ చెమటోడ్చిన అతడు ఎట్టకేలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సాధించాడు. అలా ఏడాదిన్నర తర్వాత ఐపీఎల్ 16వ సీజన్‌తో క్రికెట్‌లో పంత్ పునరాగమనం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు పొట్టి వరల్డ్ కప్ స్క్వాడ్‌కి ఎంపికయ్యాడు. జూన్‌లో అమెరికా, కరీబియన్ గడ్డపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తనదైన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఈ డాషింగ్ బ్యాటర్ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో పంత్ ఫ్రాంచైజీ మారనున్నాడని సమాచారం. రెండు సీజన్లలో ఢిల్లీని నడిపించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ టైటిల్ కలను నిజం చేయలేకపోయాడు. అందుకని ఢిల్లీ యాజమాన్యం అతడిని వదిలేసేందుకు సిద్దమైందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అదే జరిగితే మెగా వేలానికి ముందే పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరే అవకాశముంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
What's Your Reaction?