Rishabh Pant : రజనీకాంత్ స్టైల్ లో ఫొటో దిగిన పంత్ .. చూపు సీఎస్కే వైపేనా!
ఐపీఎల్ లో ఒక్క టైటిల్ కూడా గెలవని టీమ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. దీంతో టీమ్ లో మార్పులు చేపట్టాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోచ్ పాంటింగ్ ను పక్కన బెట్టిన మరో కొత్త కోచ్ కోసం వెతుకుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం ఆ టీమ్ ను వీడే అవకాశముందని సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అతడు పెట్టిన ఓ పోస్ట్ ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. పంత్ తన ఇన్‌స్టా అకౌంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ లో ఫొటో దిగి అప్ లోడ్ చేశాడు. దీనికి ‘తలైవా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పంత్ ఢిల్లీని వీడి.. చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లడం ఖాయమంటూ కామెంట్ చేస్తున్నారు. రిషబ్ పంత్ ఫామ్ పై ఢిల్లీ మేనేజ్ మెంట్ అంత సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. 2025 ఐపీఎల్ మెగా ఆంక్షన్ కు ముందు పంత్‌ను ఢిల్లీ వదులుకుంటే.. అతడిని తీసుకునేందుకు చెన్నై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ధోనీ వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ఆడకపోతే.. ఉత్తమ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్‌ను తీసుకునేందుకు సీఎస్కే ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ పెట్టిన పోస్టు ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది.

What's Your Reaction?