Road Accident | వైఎస్సార్ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి
Road Accident | వైఎస్సార్ కడప జిల్లాలో రెండు వేర్వేరూ రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.
అమరావతి : వైఎస్సార్ కడప( Kadapa) జిల్లాలో రెండు వేర్వేరూ రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. దువ్వూరు మండలం చింతకుంట వద్ద ఓ కుటుంబం కర్నూలు నుంచి తిరుమల వెళ్తుండగా కారు (Car) అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇదే జిల్లాలోని చింతకొమ్మదిన్నె పరిధిలో కారు-కంటైనర్ ఢీ కొని నలుగురు మృతి చెందారు. కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంకా మృతుల వివరాలు తెలియరాలేదు.
What's Your Reaction?