Robo Training : రోబోకు ట్రైనింగ్ ఇస్తే రోజుకు రూ.28 వేలు
ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త ఉద్యోగావశాన్ని ప్రకటించింది. రోజుకు ఏడు గంటలు నడవగలిగే సామర్థ్యంతో పాటు టెక్నాలజీ వాడకంపై అవగాహన ఉండాలి. అలాంటి వారికి గంటకు 48 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.4 వేలు)వరకు ఇవ్వడానికి సిద్ధమైంది. అలా రోజుకు 7 గంటల చొప్పున రూ.28 వేల వరకు సంపాదించుకోవచ్చు.ఆప్టిమస్ పేరిట టెస్లా రోబోను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి శిక్షణనివ్వడం కోసం వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని నియమించుకుంటోంది. తాజాగా అత్యాధునిక మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆప్టిమస్‌కు శిక్షణనిచ్చేందుకు ఉద్యోగులు కావాలని ప్రకటించింది.అధికారికంగా ఈ ఉద్యోగాన్ని టెస్లా డేటా కలెక్షన్ ఆపరేటర్‌గా పేర్కొంది. మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ధరించి నిర్దేశిత మార్గాల్లో నడవాల్సి ఉంటుంది. అలా రోజుకు ఏడు గంటలు పనిచేయాలి. సమాచారాన్ని సేకరించడం, దాన్ని విశ్లేషించడం, సమగ్ర నివేదికలు రాయడంతో పాటు ఈ క్రమంలో చిన్న పరికరాలను వాడాల్సి ఉంటుంది. కొన్ని శారీరక ప్రమాణాలను సైతం కలిగి ఉండాలి. ఎత్తు 5'7" నుంచి 5'11" మధ్య ఉండాలి. 13 కిలోల బరువు మోయగలిగే సామర్థ్యం ఉండాలి. జీతం గంటకు 25.25 డాలర్ల నుంచి 48 డాలర్ల మధ్య ఉంటుంది. అనుభవం, నైపుణ్యం సహా నిర్వర్తించబోయే విధులను అనుసరించి ప్యాకేజీ మారుతుంది. మెడికల్, డెంటల్, విజన్ బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. ఈ ఉద్యోగంలో షిఫ్ట్‌లు కూడా ఉన్నాయి. టెస్లా కెరీర్ పేజీలో ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు. కాలిఫోర్నియాలోని పాలోఆల్టోలో పనిచేయాల్సి ఉంటుంది.

What's Your Reaction?