Ruhani Sharma : సినిమా గొప్పతనాన్ని చూడాలి.. అసహనం వ్యక్తం చేసిన రుహానీ శర్మ

‘చి. ల. సౌ’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రుహానీ శర్మ. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. హిట్, డర్టీ హరి, హర్: చాప్టర్1, సైంధవ్ సినిమాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్​ కు దగ్గరైంది. అయితే, ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లయినా ఆమెకు సాలిడ్ హిట్ పడలేదు. కానీ, చేసిన తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రుహానీ శర్మ గతేడాది నటించిన ‘ఆగ్రా’మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చింది. ఇందులోని బోల్డ్ సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై రుహానీ స్పందించింది. ‘ఆగ్రా’ మూవీ ఎన్నో అవార్డులు దక్కించుకుందని.. ఆ సినిమా గొప్పతనాన్ని చూడకుండా తన సీన్లను వైరల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ నోట్ రిలీజ్ చేసింది. ‘ఆగ్రా’లోని సీన్లు లీక్‌ అయినప్పటినుంచి నేను ఎంతో నిరుత్సాహంగా ఉన్నా. మా కష్టాన్ని, డెడికేషన్ ను పట్టించుకోకుండా కేవలం కొన్ని సీన్లను మాత్రమే వైరల్ చేయడం బాధాకరం.కళాత్మక సినిమాలను రూపొందించడం పెద్ద సవాల్. వాటి కోసం నిద్ర లేని రాత్రులు గడపాలి. కొన్ని సీన్ల ఆధారంగా సినిమాపై ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ మూవీని 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది’ అని రుహానీ చెప్పుకొచ్చింది. ‘ఆగ్రా’ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులోని బోల్డ్‌ సీన్లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తుండంటో ఆమె ఇలా రియాక్ట్ అయ్యింది.

Aug 24, 2024 - 18:21
 0  2

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News