Samantha : సమంతకు పదవి ఎందుకిచ్చారో కేటీఆర్ చెప్పాలి.. ఎంపీ రఘునందన్ డిమాండ్
2014లోనే హైకోర్టు ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా అప్పుడెందుకు కూల్చ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ను బీజేపీ ఎంపీ రఘు నందర్రావు ప్రశ్నించారు. తెలంగాణ చేనేతకు నాగార్జున కోడల్ని నాడు బ్రాండ్ అంబా సిడర్ గా పెట్టడం వెనుకున్న మతలబేంటి? అని నిలదీశారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా? పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో ముక్కుపిండి వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇల్లు లేవా? హరీశ్, కవిత, కేటీఆర్ కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. ముందు ముగ్గురు ఇండ్లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు
2014లోనే హైకోర్టు ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా అప్పుడెందుకు కూల్చ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ను బీజేపీ ఎంపీ రఘు నందర్రావు ప్రశ్నించారు. తెలంగాణ చేనేతకు నాగార్జున కోడల్ని నాడు బ్రాండ్ అంబా సిడర్ గా పెట్టడం వెనుకున్న మతలబేంటి? అని నిలదీశారు.
చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా?
పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో ముక్కుపిండి వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇల్లు లేవా? హరీశ్, కవిత, కేటీఆర్ కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. ముందు ముగ్గురు ఇండ్లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు
What's Your Reaction?