Saripoda Sanivaram : సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’. గతంలో నానితో అంటే సుందరానికి అనే మూవీ తీసిన వివేక్ ఆత్రేయ ఈ మూవీ డైరెక్టర్. డివివి దానయ్య నిర్మించాడు. ఈ నెల 29న విడుదల కాబోతోందీ సరిపోదా శనివారం. ప్యాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ కోసం నాని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే సౌత్ మొత్తం తిరిగేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ముంబైలో ప్రచారం చేయడానికి అక్కడికి వెళ్లారు.నాని ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య నాని ఎక్కువగా మాస్ మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తుండం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ సినిమా కూడా కనిపిస్తోంది. నాని క్యారెక్టరైజేషన్ సాఫ్ట్ గా కనిపిస్తూనే శనివారం రోజు అగ్రెసివ్ గా మారిపోతుంది. మరి అతని కోపానికి కారణం ఎవరు అనేది ఆల్రెడీ ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ వరకూ అయితే మిక్స్ డ్ రెస్పాన్సే వచ్చింది. మొత్తంగా నాని కూడా చాలా హోప్స్ పెట్టుకున్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24న నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోనే కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రోగ్రామ్ జరగబోతోంది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరైనా చీఫ్ గెస్ట్ లు ఉంటారా లేక మూవీ టీమ్ తోనే నిర్వహించబోతున్నారా అనేది శుక్రవారం సాయంత్రం వరకు తెలుస్తుంది. 

Aug 23, 2024 - 11:15
 0  14
Saripoda Sanivaram : సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’. గతంలో నానితో అంటే సుందరానికి అనే మూవీ తీసిన వివేక్ ఆత్రేయ ఈ మూవీ డైరెక్టర్. డివివి దానయ్య నిర్మించాడు. ఈ నెల 29న విడుదల కాబోతోందీ సరిపోదా శనివారం. ప్యాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ కోసం నాని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే సౌత్ మొత్తం తిరిగేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ముంబైలో ప్రచారం చేయడానికి అక్కడికి వెళ్లారు.

నాని ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య నాని ఎక్కువగా మాస్ మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తుండం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ సినిమా కూడా కనిపిస్తోంది. నాని క్యారెక్టరైజేషన్ సాఫ్ట్ గా కనిపిస్తూనే శనివారం రోజు అగ్రెసివ్ గా మారిపోతుంది. మరి అతని కోపానికి కారణం ఎవరు అనేది ఆల్రెడీ ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ వరకూ అయితే మిక్స్ డ్ రెస్పాన్సే వచ్చింది. మొత్తంగా నాని కూడా చాలా హోప్స్ పెట్టుకున్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24న నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోనే కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రోగ్రామ్ జరగబోతోంది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరైనా చీఫ్ గెస్ట్ లు ఉంటారా లేక మూవీ టీమ్ తోనే నిర్వహించబోతున్నారా అనేది శుక్రవారం సాయంత్రం వరకు తెలుస్తుంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News