Saripodhaa Sanivaaram :
నాని సినిమాపై రవితేజ ఎఫెక్ట్ ...
కొన్ని సందర్భాల్లో సినిమాలకు ఏది ప్లస్ అవుతుందో వేరే సందర్భాల్లో అదే మైనస్ అవుతుంది. అయితే ప్లస్ అయ్యేది సినిమాపై నమ్మకం ఉన్నప్పుడు. మైనస్ అయ్యేది సినిమాను అతిగా ఊహించుకున్నప్పుడు. ఈ రెండు సందర్భాలకు వేదిక పెయిడ్ ప్రీమియర్స్. ప్రధానంగా పెయిడ్ ప్రీమియర్స్ చిన్న సినిమాలకు ఎక్కువగా వర్కవుట్ అవుతాయి. తమ సినిమా చాలా బాగా వచ్చిందనే నమ్మకంతో ఒక రోజు ముందే షో వేస్తారు. చూసినవాళ్లు బావుంటే బైట్స్ ఇస్తారు. ఇది నెక్ట్స్ డే ఓపెనింగ్స్ కు యూజ్ అవుతుంది. అలా ఈ మధ్య బాగా లాభపడ్డ స్మాల్ మూవీస్ ఉన్నాయి.ఇలాగే తమ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందని మాస్ మహరాజ రవితే, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ కు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. కట్ చేస్తే రిలీజ్ ముందు రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుందీ మూవీ. దీంతో ఎపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడటమే కాక.. ఓవరాల్ గా సినిమా రిజల్టే దారుణంగా తేలింది. ఇది ఆ మూవీ టీమ్ నుంచి ఎవరూ ఊహించలేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అందరూ సీనియర్సే కాబట్టి. అయితే మిస్టర్ బచ్చన్ లా అవుతుందని భయపడ్డారో లేక భావించారో కానీ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ అనేం పెట్టుకోవడం లేదు. యస్.. రవితేజ ఎఫెక్ట్ వల్లే నాని ఇలాంటి ప్రమోషన్ కు నో చెప్పాడు అంటున్నారు. ఎలాగూ రిలీజ్ రోజు ఉదయం 7 గంటలకే షో పడుతుంది కాబట్టి పెయిడ్ ప్రీమియర్స్ తో లేని పోని తలనొప్పులు ఎందుకు అనుకున్నారట. అదీ మేటర్. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన సరిపోదా శనివారంలో ఎస్.జే. సూర్య, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ గురువారం విడుదల కాబోతోన్న సరిపోదా శనివారంపై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు.


కొన్ని సందర్భాల్లో సినిమాలకు ఏది ప్లస్ అవుతుందో వేరే సందర్భాల్లో అదే మైనస్ అవుతుంది. అయితే ప్లస్ అయ్యేది సినిమాపై నమ్మకం ఉన్నప్పుడు. మైనస్ అయ్యేది సినిమాను అతిగా ఊహించుకున్నప్పుడు. ఈ రెండు సందర్భాలకు వేదిక పెయిడ్ ప్రీమియర్స్. ప్రధానంగా పెయిడ్ ప్రీమియర్స్ చిన్న సినిమాలకు ఎక్కువగా వర్కవుట్ అవుతాయి. తమ సినిమా చాలా బాగా వచ్చిందనే నమ్మకంతో ఒక రోజు ముందే షో వేస్తారు. చూసినవాళ్లు బావుంటే బైట్స్ ఇస్తారు. ఇది నెక్ట్స్ డే ఓపెనింగ్స్ కు యూజ్ అవుతుంది. అలా ఈ మధ్య బాగా లాభపడ్డ స్మాల్ మూవీస్ ఉన్నాయి.
ఇలాగే తమ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందని మాస్ మహరాజ రవితే, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ కు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. కట్ చేస్తే రిలీజ్ ముందు రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుందీ మూవీ. దీంతో ఎపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడటమే కాక.. ఓవరాల్ గా సినిమా రిజల్టే దారుణంగా తేలింది. ఇది ఆ మూవీ టీమ్ నుంచి ఎవరూ ఊహించలేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అందరూ సీనియర్సే కాబట్టి.
అయితే మిస్టర్ బచ్చన్ లా అవుతుందని భయపడ్డారో లేక భావించారో కానీ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ అనేం పెట్టుకోవడం లేదు. యస్.. రవితేజ ఎఫెక్ట్ వల్లే నాని ఇలాంటి ప్రమోషన్ కు నో చెప్పాడు అంటున్నారు. ఎలాగూ రిలీజ్ రోజు ఉదయం 7 గంటలకే షో పడుతుంది కాబట్టి పెయిడ్ ప్రీమియర్స్ తో లేని పోని తలనొప్పులు ఎందుకు అనుకున్నారట. అదీ మేటర్. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన సరిపోదా శనివారంలో ఎస్.జే. సూర్య, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ గురువారం విడుదల కాబోతోన్న సరిపోదా శనివారంపై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
What's Your Reaction?






