Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారంకు సూర్య ప్లస్సా.. మైనస్సా

Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారంకు సూర్య ప్లస్సా.. మైనస్సా - నాని సినిమా వస్తోందంటే వారం పది రోజులు ముందుగానే ఓ సందడి ఉంటుంది. కానీ ఫస్ట్ టైమ్ అలాంటిదేం లేకుండా కనిపిస్తోంది సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం విడుదల కాబోతోంది. అయితే ఇప్పటి వరకూ సరిపోదా శనివారంకు ఆశించినంత హైప్ అయితే రాలేదు అనేది నిజం. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక్కడే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇతర భాషల్లో అంటే కష్టం. తమిళ్ వరకూ సూర్య వల్ల కొంత క్రేజ్ ఉండొచ్చు. హిందీలో ప్రభాస్ పై అర్షద్ వార్శీ చేసి కమెంట్స్ కు కౌంటర్ ఇవ్వడం ద్వారా నాని కొంత హైలెట్ అయినా ఓవరాల్ గా అది అతనికి మైనస్ అవుతుందనే విశ్లేషణలున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించి ముందు నుంచీ హైప్ చేసి చెబుతున్న పేరు ఎస్.జే సూర్య. బట్ ఈ సినిమాకు ప్రధాన లోపంగా అతనే కనిపిస్తున్నాడు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. నిన్నటికి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి కంటే సూర్య గురించీ.. అతని ఖుషీ గురించిన మాటలే ఎక్కువగా వచ్చాయి. హీరోయిన్ కూడా ఖుషీకి సీక్వెల్ కావాలని వేదికపైనే అడగడం చూస్తే సరిపోదా శనివారం పై వారికి ఎంత సీరియస్ నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి హీరో నాని కూడా ఇన్ డైరెక్ట్ గా సూర్యనే హైలెట్ చేశాడు. ఈ మూవీ చూసి బయటకు వచ్చిన వాళ్లంతా ముందు సూర్య గురించే మాట్లాడుకుంటారనీ.. తన గురించి తర్వాత మాట్లాడుకుంటారని చెప్పడం చూస్తుంటే వీరికి రిజల్ట్ ముందే తెలిసి దాన్ని సూర్యపై నెట్టేస్తున్నారా అనే డౌట్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతలా సూర్య నామస్మరణ జరిగిందీ వేడుకలో. నిజానికి సూర్య గొప్ప నటుడా అంటే అవునని చెప్పలేం. కేవలం దర్శకుడుగా రెండు ఇండస్ట్రీస్ లోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. అంతే. ఆ క్రేజ్ తోనే నటుడయ్యాడు. తన అగ్రెసివ్ నెస్ కు తగ్గ పాత్రలతోనే ఆకట్టుకుంటున్నాడు తప్ప.. అరే సూర్య అద్భుతంగా నటించాడు అని చెప్పడానికి ఆ విలనీ తప్ప ఇంకేం చేయలేదు. సో.. ఓవరాల్ గా చూస్తుంటే.. మేకర్స్ కు సూర్య ప్లస్ అవుతున్నాడు అనిపిస్తుందేమో కానీ.. ఈ తతంగం అంతా చూస్తోన్న వారికి అతనే పెద్ద మైనస్ కాబోతున్నాడని అర్థం అవుతోంది. విశేషం ఏంటంటే.. తమిళనాడులో ఏ ఇంటర్వ్యూలో కూడా నానిని సూర్య పూర్తిగా మాట్లాడనివ్వలేదు. అంతా తానే అయ్యాడు. నాని క్వశ్చన్స్ కు కూడా అతనే ఆన్సర్ చెబుతూ మొత్తం ఇంటర్వ్యూనే ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వచ్చాయి.

Aug 25, 2024 - 23:06
Aug 25, 2024 - 23:10
 0  6
Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారంకు సూర్య ప్లస్సా.. మైనస్సా

నాని సినిమా వస్తోందంటే వారం పది రోజులు ముందుగానే ఓ సందడి ఉంటుంది. కానీ ఫస్ట్ టైమ్ అలాంటిదేం లేకుండా కనిపిస్తోంది సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం విడుదల కాబోతోంది. అయితే ఇప్పటి వరకూ సరిపోదా శనివారంకు ఆశించినంత హైప్ అయితే రాలేదు అనేది నిజం. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక్కడే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇతర భాషల్లో అంటే కష్టం. తమిళ్ వరకూ సూర్య వల్ల కొంత క్రేజ్ ఉండొచ్చు. హిందీలో ప్రభాస్ పై అర్షద్ వార్శీ చేసి కమెంట్స్ కు కౌంటర్ ఇవ్వడం ద్వారా నాని కొంత హైలెట్ అయినా ఓవరాల్ గా అది అతనికి మైనస్ అవుతుందనే విశ్లేషణలున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ముందు నుంచీ హైప్ చేసి చెబుతున్న పేరు ఎస్.జే సూర్య. బట్ ఈ సినిమాకు ప్రధాన లోపంగా అతనే కనిపిస్తున్నాడు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. నిన్నటికి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి కంటే సూర్య గురించీ.. అతని ఖుషీ గురించిన మాటలే ఎక్కువగా వచ్చాయి. హీరోయిన్ కూడా ఖుషీకి సీక్వెల్ కావాలని వేదికపైనే అడగడం చూస్తే సరిపోదా శనివారం పై వారికి ఎంత సీరియస్ నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి హీరో నాని కూడా ఇన్ డైరెక్ట్ గా సూర్యనే హైలెట్ చేశాడు. ఈ మూవీ చూసి బయటకు వచ్చిన వాళ్లంతా ముందు సూర్య గురించే మాట్లాడుకుంటారనీ.. తన గురించి తర్వాత మాట్లాడుకుంటారని చెప్పడం చూస్తుంటే వీరికి రిజల్ట్ ముందే తెలిసి దాన్ని సూర్యపై నెట్టేస్తున్నారా అనే డౌట్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతలా సూర్య నామస్మరణ జరిగిందీ వేడుకలో.

నిజానికి సూర్య గొప్ప నటుడా అంటే అవునని చెప్పలేం. కేవలం దర్శకుడుగా రెండు ఇండస్ట్రీస్ లోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. అంతే. ఆ క్రేజ్ తోనే నటుడయ్యాడు. తన అగ్రెసివ్ నెస్ కు తగ్గ పాత్రలతోనే ఆకట్టుకుంటున్నాడు తప్ప.. అరే సూర్య అద్భుతంగా నటించాడు అని చెప్పడానికి ఆ విలనీ తప్ప ఇంకేం చేయలేదు. సో.. ఓవరాల్ గా చూస్తుంటే.. మేకర్స్ కు సూర్య ప్లస్ అవుతున్నాడు అనిపిస్తుందేమో కానీ.. ఈ తతంగం అంతా చూస్తోన్న వారికి అతనే పెద్ద మైనస్ కాబోతున్నాడని అర్థం అవుతోంది. విశేషం ఏంటంటే.. తమిళనాడులో ఏ ఇంటర్వ్యూలో కూడా నానిని సూర్య పూర్తిగా మాట్లాడనివ్వలేదు. అంతా తానే అయ్యాడు. నాని క్వశ్చన్స్ కు కూడా అతనే ఆన్సర్ చెబుతూ మొత్తం ఇంటర్వ్యూనే ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వచ్చాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News