Saripodhaa Sanivaaram : 'సరిపోదా శనివారం’ నాని మూవీ అదుర్స్
Saripodhaa Sanivaaram : 'సరిపోదా శనివారం’ నాని మూవీ అదుర్స్
నిన్న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.85 కోట్ల(గ్రాస్) కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ.20.40 కోట్లు కొల్లగొట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగిందని వీకెండ్ పూర్తయ్యేలోపు బ్రేక్ ఈవెన్ రావొచ్చని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, సరిపోదా శనివారం సినిమాలో నానికి జోడీగా చారులత పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. పవర్‌ఫుల్ విలన్‌గా ఎస్‌జే సూర్య అదరగొట్టారని టాక్. వీరితోపాటు మురళీ శర్మ, సాయి కుమార్, అలీ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ అందించిన బీజీఎమ్ ఊర మాస్ లెవెల్‌లో ఉందని ప్రశంసలు వస్తున్నాయి.
What's Your Reaction?