Saripodhaa Sanivaaram : నాని సినిమాకు హైప్ ఏదీ..?

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం. ఈ నెల 29న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. డివివి దానయ్య నిర్మించాడు. అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినా ఈ మూవీపై ఆశించిన బజ్ కనిపించడం లేదు. అస్సలే మాత్రం హైప్ లేదు అనే టాక్ వినిపిస్తోంది. నాని తన ఇమేజ్ కు భిన్నంగా మాస్ సినిమా చేయడం ఓ కారణం అయితే అదే కారణంతో దర్శకుడూ ఉండటం మూలంగా సినిమాకు బజ్ క్రియేట్ కావడం లేదు అంటున్నారు. వివేక్ ఆత్రేయ గతంలో రూపొందించిన సినిమాలన్నీ చాలా సాఫ్ట్ గా కనిపిస్తాయి. హ్యూమన్ ఎమోషన్స్ తో సెన్సిబుల్ కామెడీతో కనిపించాయి. ఈ సారి అందుకు భిన్నంగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో సరిపోదా శనివారం కనిపిస్తోంది. ఎస్. జే. సూర్య విలన్ గా నటిస్తున్నాడు అనే మాట కూడా సినిమాకు ఎసెట్ గా కనిపించడం లేదు.ఇక హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గతంలో నానితో నటించిన గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయింది. పైగా ఇప్పటి వరకూ వచ్చిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అటు ట్రైలర్ చూస్తే అంతా శనివారమే అన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అర్థం అవుతోంది. మామూలుగా నాని మూవీస్ కనీసం పది రోజుల ముందు నుంచైనా హడావిడీ కనిపిస్తుంది. బట్ ఈ మూవీకి అదేం కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మేటర్ కూడా హైప్ తేలేదు అంటే సరిపోదా శనివారం ప్రమోషన్స్ ఎంత చప్పగా ఉన్నాయో చెబుతోంది. రిలీజ్ కు ఐదు రోజులు కూడా లేదు. మరి ఇంత తక్కువ టైమ్ లో సినిమాకు హైప్ తేవడం కూడా అంత సులువేం కాదు. ఏదేమైనా నాని లాంటి హీరో సినిమాకే ఇలా ఉంటే.. ఈ సినిమా ఎంత మేరకు జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. 

Aug 24, 2024 - 18:22
 0  5
Saripodhaa Sanivaaram : 
నాని సినిమాకు హైప్ ఏదీ..?

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం. ఈ నెల 29న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. డివివి దానయ్య నిర్మించాడు. అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినా ఈ మూవీపై ఆశించిన బజ్ కనిపించడం లేదు. అస్సలే మాత్రం హైప్ లేదు అనే టాక్ వినిపిస్తోంది. నాని తన ఇమేజ్ కు భిన్నంగా మాస్ సినిమా చేయడం ఓ కారణం అయితే అదే కారణంతో దర్శకుడూ ఉండటం మూలంగా సినిమాకు బజ్ క్రియేట్ కావడం లేదు అంటున్నారు. వివేక్ ఆత్రేయ గతంలో రూపొందించిన సినిమాలన్నీ చాలా సాఫ్ట్ గా కనిపిస్తాయి. హ్యూమన్ ఎమోషన్స్ తో సెన్సిబుల్ కామెడీతో కనిపించాయి. ఈ సారి అందుకు భిన్నంగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో సరిపోదా శనివారం కనిపిస్తోంది. ఎస్. జే. సూర్య విలన్ గా నటిస్తున్నాడు అనే మాట కూడా సినిమాకు ఎసెట్ గా కనిపించడం లేదు.

ఇక హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గతంలో నానితో నటించిన గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయింది. పైగా ఇప్పటి వరకూ వచ్చిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అటు ట్రైలర్ చూస్తే అంతా శనివారమే అన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అర్థం అవుతోంది. మామూలుగా నాని మూవీస్ కనీసం పది రోజుల ముందు నుంచైనా హడావిడీ కనిపిస్తుంది. బట్ ఈ మూవీకి అదేం కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మేటర్ కూడా హైప్ తేలేదు అంటే సరిపోదా శనివారం ప్రమోషన్స్ ఎంత చప్పగా ఉన్నాయో చెబుతోంది. రిలీజ్ కు ఐదు రోజులు కూడా లేదు. మరి ఇంత తక్కువ టైమ్ లో సినిమాకు హైప్ తేవడం కూడా అంత సులువేం కాదు. ఏదేమైనా నాని లాంటి హీరో సినిమాకే ఇలా ఉంటే.. ఈ సినిమా ఎంత మేరకు జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News