School Bus: దారుణం.. చిన్నారులున్న స్కూలు బస్సుకు నిప్పుపెట్టే ప్రయత్నం
స్కూల్ బస్సు ముందుకు వెళ్లడంతో తప్పిన ముప్పు
ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ పలు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బిహార్‌లో కొందరు ఆకతాయిల చేష్టలు తీవ్ర ఆందోళకు గురిచేశాయి. రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టిన ఆందోళనకారులు.. ఆ మార్గంలో చిన్నారులతో వెళ్తున్న ఓ స్కూలు బస్సుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. పోలీసుల అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పింది.
భారత్ బంద్ సందర్భంగా విద్యార్థులున్న స్కూల్ బస్సుకు నిప్పు పెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే కాలుతున్న టైర్ మీదుగా ఆ స్కూల్ బస్సు వెళ్లింది. పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యతిరేకంగా బుధవారం దేశ వ్యాప్తంగా బంద్‌కు ఆ వర్గాలు పిలుపునిచ్చాయి.
కాగా, పాట్నాలోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో గందరగోళం నెలకొన్నది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అలాగే స్కూల్ బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. బస్సును అడ్డుకుని కాలుతున్న టైర్‌ను వాహనం కిందకు నెట్టారు. అయితే స్కూల్ బస్సు ముందుకు వెళ్లడంతో అందులో ఉన్న పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆందోళనకారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
What's Your Reaction?