డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సీక్రెట్ కెమెరాలు- రాధికా శరత్ కుమార్ వ్యాఖ్యలు
డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సీక్రెట్ కెమెరాలు- రాధికా శరత్ కుమార్ వ్యాఖ్యలు
డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సీక్రెట్ కెమెరాలు- రాధికా శరత్ కుమార్ వ్యాఖ్యలు. కారవాన్ అందులోనూ సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించారంటూ నటి రాధికాశరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమకమిటీ రిపోర్టు అనంతరం సర్కారు చర్యలు ప్రారంభించడంతో ఇలాంటి ఘటనలపై అగ్రనటులు సైతం స్పందిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు రాధిక.
కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడం బాధాకరమని చెప్పుకొచ్చారు.
46 ఏళ్ల నుంచి నేను ఈ పరిశ్రమలో ఉన్నానని, అన్నిచోట్లా ఇదేవిధమైన సమస్యలు మహిళలకుఎదురవుతున్నాయని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.
‘ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు చోటుచేసుకున్న ఘటనను ఎప్పటికీ మర్చిపోను. షాట్ ముగించుకుని నేను వెళ్తుండగా.. సెట్లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్లో ఏదో చూస్తు నవ్వుకుంటున్నారు. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి.. ఏం చూస్తున్నారని అడిగా. కారవాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని తెలిసింది. ఈవిషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెబుతానని ఆ టీమ్ కు వార్నింగ్ ఇచ్చా. 'ఆ తర్వాత కారవాన్ ఉపయోగించాలంటే భయమేసిందని అన్నారు
What's Your Reaction?