Sensational Comments | చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ కుప్పకూలడంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Sensational Comments | ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్( Helicopter) సీఎం చంద్రబాబుకు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి : ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్( Helicopter) సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కోసం ముంబై నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌ను తీసుకువస్తుండగా పుణే(Pune) సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఏవియేషన్ సిబ్బంది స్వల్పగాయాలతో బయట పడ్డారు. అయితే హెలికాప్టర్ మాత్రం ఎందుకు పనికిరాకుండా పోయింది .
ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా 16 సంవత్సరాల క్రితం నాటి హెలికాప్టర్‌ను ఏపీ సీఎంకు కేటాయించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఏపీకి చెందిన ఎంపీ, కేంద్ర ఏవియేషన్ మంత్రి (Union Minister ) కింజరపు రామోహ్మన్‌నాయుడు ( Rammohan naidu) స్పందించారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని , నివేదిక వచ్చిన తరువాతే ఘటనపై మాట్లాడుతానని వెల్లడించారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.
What's Your Reaction?