Sheikh Hasina : హసీనాకు బంగ్లా సర్కారు షాక్.. దౌత్య పాస్ పోర్ట్ రద్దు
అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్ పోర్ట్ ను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. హసీనా హయాంలో పార్లమెంటు సభ్యులకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్ పోర్ట్ లను రద్దు చేస్తూ ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ పాస్ పోర్ట్ తో హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. కాగా, ఆమె ఈ నెల 5 నుంచి భారత్లోనే ఉంటున్నారు. యూకే లేదా అమెరికా వెళ్లాలని అనుకున్నప్పటికీ ఆ దేశాలు హసీనాకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు బంగ్లాదేశ్ నేతలు ఆమెను తిరిగి అప్పగించాలని భారత్ను కోరుతున్నారు. అయితే అధికారికంగా ఆ దేశం కేంద్రాన్ని కోరలేదు.


అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్ పోర్ట్ ను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది.
హసీనా హయాంలో పార్లమెంటు సభ్యులకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్ పోర్ట్ లను రద్దు చేస్తూ ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ పాస్ పోర్ట్ తో హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. కాగా, ఆమె ఈ నెల 5 నుంచి భారత్లోనే ఉంటున్నారు.
యూకే లేదా అమెరికా వెళ్లాలని అనుకున్నప్పటికీ ఆ దేశాలు హసీనాకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు బంగ్లాదేశ్ నేతలు ఆమెను తిరిగి అప్పగించాలని భారత్ను కోరుతున్నారు. అయితే అధికారికంగా ఆ దేశం కేంద్రాన్ని కోరలేదు.
What's Your Reaction?






