Shraddha Kapoor Stree 2 : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించిన సినిమా స్త్రీ2. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్ గా అదే దర్శకుడు అమర్ కౌశిక్ రూపొందించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలైంది. రిలీజ్ కు ముందు రోజు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందీ మూవీ. ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో 65 కోట్ల వసూళ్లు సాధించి ఎంటైర్ బాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేసింది. అప్పటి నుంచి కమర్షియల్ గా ఊహించని వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ ను దాటింది స్త్రీ 2 మూవీ.స్త్రీ 2 ఇండియా నుంచి 342 కోట్లు, ఓవర్శీస్ నుంచి 59 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎలా చూసినా ఈ యేడాది బాలీవుడ్ కు ఇదే అతి పెద్ద విజయం. ఈ ఊపు ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే రిలీజ్ అయిన ఏడో రోజు కూడా 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో.. స్త్రీ 2 దూకుడు చూస్తోంటే ఈజీగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ మూవీకి పోటీగా మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవి లేకుండా సోలో రిలీజ్ దక్కి ఉంటే ఖచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేదే అంటున్నారు. మొత్తంగా 2024లో బాలీవుడ్ పరువును స్త్రీ కాపాడింది అనే చెప్పాలి.
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించిన సినిమా స్త్రీ2. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్ గా అదే దర్శకుడు అమర్ కౌశిక్ రూపొందించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలైంది. రిలీజ్ కు ముందు రోజు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందీ మూవీ. ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో 65 కోట్ల వసూళ్లు సాధించి ఎంటైర్ బాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేసింది. అప్పటి నుంచి కమర్షియల్ గా ఊహించని వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ ను దాటింది స్త్రీ 2 మూవీ.
స్త్రీ 2 ఇండియా నుంచి 342 కోట్లు, ఓవర్శీస్ నుంచి 59 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎలా చూసినా ఈ యేడాది బాలీవుడ్ కు ఇదే అతి పెద్ద విజయం. ఈ ఊపు ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే రిలీజ్ అయిన ఏడో రోజు కూడా 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో.. స్త్రీ 2 దూకుడు చూస్తోంటే ఈజీగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ మూవీకి పోటీగా మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవి లేకుండా సోలో రిలీజ్ దక్కి ఉంటే ఖచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేదే అంటున్నారు. మొత్తంగా 2024లో బాలీవుడ్ పరువును స్త్రీ కాపాడింది అనే చెప్పాలి.
What's Your Reaction?