Sobhita Dhulipala : స్పెషల్ సాంగ్ కు శోభిత దూళిపాళ్ల రెడీ?

‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు అందం శోభిత దూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢచారి సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమైంది. మ​లయాళంలో కురుప్, తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లలో నటించిన శోభితకు ఇటీవల టాలీవుడ్ హీరో నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ ప్రాజెక్ట్ లు ఎంచుకుంటూ శోభిత ముందుకెళ్తోంది. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఓ సూపర్‌హిట్‌ మూవీ సీక్వెల్ డాన్3లో ఆమె భాగం కానున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘డాన్‌’. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘డాన్‌ 2’ కూడా బాక్సాఫీసు వద్ద హిట్టయ్యింది. ఈ రెండు సినిమాలకు కొనసాగింపుగా త్వరలో ‘డాన్‌ 3’ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఇది రూపుదిద్దుకోనుంది. ఫర్హాన్ అక్తర్‌ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూట్‌ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం శోభిత ధూళిపాళ్లను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫర్హాన్‌.. ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై శోభిత లేదా ఆమె టీమ్‌ ఏమాత్రం స్పందించలేదు.

Aug 23, 2024 - 11:15
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News