ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు..రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి: Dr.గొట్టిపాటి లక్ష్మీ-లలిత్ సాగర్
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు..రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి: Dr.గొట్టిపాటి లక్ష్మీ-లలిత్ సాగర్
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంతోషమే దేవుడిని కోరుకునేది: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శిలో గొట్టిపాటి లక్ష్మీ ప్రత్యేక పూజలు దర్శి ప్రాంతం, రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని, ప్రజలు సంతోషంగా ఉండాలనే తాను ఎప్పుడూ ఆ భగవంతుడుని కోరుకుంటానని అన్నారు దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. ప్రజలందరూ బాగుండి మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తన ప్రార్థనగా ఉంటుందన్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శి మండలం వెంకటాచలం పల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గొట్టిపాటి లక్ష్మీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు గొట్టిపాటి లక్ష్మీ కి స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్ష్మీ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన, విశేషమైన రోజు అని, వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే రోజు అని తెలిపారు. పర్వదినం రోజున స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే విశేషంగా ఆశీస్సులు ఇస్తారని భక్తుల నమ్మకమని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సహా వైష్ణవాలయాల్లో విశేషంగా పూజలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చారని, వారందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దర్శి ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి శక్తివంచన లేకుండా పాటుపడతానని తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
What's Your Reaction?