Spirit | క్రేజీ న్యూస్.. ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ టైం చెప్పిన సందీప్ రెడ్డి వంగా..!
Spirit | సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ యాకట్ర్ రణ్ బీర్‌కపూర్ యానిమల్ తెరకెక్కించి మరోసారి రికార్డుల వర్షం కురిపించాడు. కాగా సందీప్ రెడ్డి వంగా కాంపౌండ్ నుంచి రాబోతున్న మరో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్‌లో నటించబోతున్నాడని తెలిసిందే.
Spirit | సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్ బీర్‌కపూర్‌తో యానిమల్ తెరకెక్కించి మరోసారి రికార్డుల వర్షం కురిపించాడు. కాగా సందీప్ రెడ్డి వంగా కాంపౌండ్ నుంచి రాబోతున్న మరో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్‌లో నటించబోతున్నాడని తెలిసిందే.
ఓ చిట్ చాట్‌లో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. నా తర్వాతి రెండు సినిమాలను నాలుగేళ్లు ప్లాన్ చేసుకున్నా. ప్రభాస్‌తో చేస్తున్న స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. స్పిరిట్ రెండేళ్లలో విడుదలవుతుంది. ఆ తర్వాత రణ్‌బీర్‌కపూర్‌తో తెరకెక్కించిన యానిమల్ సీక్వెల్ ప్రాజెక్ట్ యానిమల్ పార్క్ పనులు మొదలుపెడతానని చెప్పుకొచ్చాడు. స్పిరిట్‌ను 2026లో రిలీజ్ చేయనుండగా.. యానిమల్ పార్క్‌ను 2028లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి మూవీ లవర్స్‌లో నెలకొన్న సస్పెన్స్‌కు చెక్ పెట్టేశాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ చిత్రంలో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్‌సియోక్ (MaDongSeok) విలన్‌గా కనిపించబోతున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఆసియన్ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయనున్నారు. స్పిరిట్‌లో ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతుండటంతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు అభిమానులు. సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ స్పిరిట్ సినిమాను నిర్మించనున్నారు.
“I’ve planned my next two films for the next four years. Pre-production for #Spirit with Rebel star #Prabhas has started and will release in two years. After that, I’ll begin work on #AnimalPark with Super star #RanbirKapoor.”
– #SandeepReddyVanga pic.twitter.com/VNWIQQBT9J
— Hail Prabhas (@HailPrabhas007) August 26, 2024
What's Your Reaction?