ఏపీలో HMPV వైరస్ కేసులు వ్యాప్తి పై - ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

ఏపీలో HMPV వైరస్ కేసులు వ్యాప్తి పై- ఏపీ ప్రభుత్వం అప్రమత్తం - ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం... ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు

Jan 8, 2025 - 23:20
Jan 8, 2025 - 23:35
 0  40
ఏపీలో HMPV  వైరస్ కేసులు  వ్యాప్తి పై - ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

హెచ్ఎంపీ వైరస్ 2001 నుంచే ఉందని, కానీ వ్యాప్తి తీవ్రత చాలా తక్కువని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. ఏపీలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు.

దేశంలో సంచలనం సృష్టిస్తున్న హెచ్ఎంపీ వైరస్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్‌పై ప్రభుత్వానికి టెక్నికల్ సాయం అందించే టాస్క్‌ఫోర్స్ లేదా ఎక్స్‌పర్ట్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రీషియన్, శ్వాసకోస వ్యాధి నిపుణులు, ప్రివెంటివ్ మెడిసన్ ఆచార్యులు సభ్యులుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రజలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తీవ్రమైన ఊపిరి సంబంధ సమస్యలు ఈ వైరస్ వల్ల రావని, ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతి చాలా స్వల్పంగా ఉన్నందున ఇప్పటికిప్పుడు అప్రమత్తత అవసరం లేదని ఆయన చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News