Sreeleela to Kollywood : కోలీవుడ్ కు శ్రీ లీల

తెలుగులో దీపావళి ధమాకాలా దూసుకొచ్చింది శ్రీలీల. ఫస్ట్ మూవీ పెళ్లి సందడి అయినా తన ఛరిష్మాను చూపించింది ధమాకానే. అమ్మడి డ్యాన్సులు, హైపర్ యాక్టివిటీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ మాటకొస్తే ఇండస్ట్రీ కూడా ఇదైపోయింది. అందుకే వరుసగా ఆఫర్స్. యంగ్ స్టర్స్ నుంచి టాప్ స్టార్స్ వరకూ శ్రీ లీల కావాలి అనేశారు. బట్ అక్కడే అమ్మడి లక్ అడ్డం తిరిగింది. వచ్చిన సినిమాలన్నీ వరసగా పోయాయి. ఒక్కటీ బ్లాక్ బస్టర్ కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ వరకూ హీరోయిన్లనే బద్నాం చేస్తారు కదా. అలాగే శ్రీ లీలను కూడా ఐరన్ లెగ్ అనేశారు. అంతే ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ఆగిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ఇది వస్తుందో లేదో కూడా తెలియదు. వచ్చినా హరీష్ శంకర్ దర్శకుడు కాబట్టి ఆమెకు ప్లస్ అవుతుందని కూడా అనుకోలేం. ఆడియన్స్ ఫోకస్ పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది.ఒక భాషలో ఆఫర్స్ లేకపోతే మరో భాషలో అడుగులు వేస్తారు హీరోయిన్లు. ఈ మేరకు శ్రీ లీల కూడా కోలీవుడ్ వైపు చూసింది. అక్కడ కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ.. ఏదీ కమిట్ కాలేదు. కాస్త లేట్ అయినా బంపర్ ఆఫర్ పట్టేసింది. ఆకాశం నీ హద్దురా అనే మూవీతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సుధా కొంగర దర్శకత్వంలో సినిమా చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి గతంలోనే వార్తలు వచ్చాయి. అప్పుడు హీరో శివకార్తికేయన్.. నిర్మాత సూర్య. బట్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మారిందట. బట్ హీరో మాత్రం శివకార్తికేయన్. శివకార్తికేయన్ అంటే కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరో. ఇక సుధ కొంగర చేతిలో పడిందంటే హీరోయిన్ కు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే ఉంటుంది. సో.. కోలీవుడ్ కు సంబంధంచి శ్రీ లీలకు ఇది పర్ఫెక్ట్ లాంచ్ అనే చెప్పాలి. 

Aug 29, 2024 - 08:10
 0  3
Sreeleela to Kollywood  :
కోలీవుడ్ కు శ్రీ లీల

తెలుగులో దీపావళి ధమాకాలా దూసుకొచ్చింది శ్రీలీల. ఫస్ట్ మూవీ పెళ్లి సందడి అయినా తన ఛరిష్మాను చూపించింది ధమాకానే. అమ్మడి డ్యాన్సులు, హైపర్ యాక్టివిటీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ మాటకొస్తే ఇండస్ట్రీ కూడా ఇదైపోయింది. అందుకే వరుసగా ఆఫర్స్. యంగ్ స్టర్స్ నుంచి టాప్ స్టార్స్ వరకూ శ్రీ లీల కావాలి అనేశారు. బట్ అక్కడే అమ్మడి లక్ అడ్డం తిరిగింది. వచ్చిన సినిమాలన్నీ వరసగా పోయాయి. ఒక్కటీ బ్లాక్ బస్టర్ కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ వరకూ హీరోయిన్లనే బద్నాం చేస్తారు కదా. అలాగే శ్రీ లీలను కూడా ఐరన్ లెగ్ అనేశారు. అంతే ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ఆగిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ఇది వస్తుందో లేదో కూడా తెలియదు. వచ్చినా హరీష్ శంకర్ దర్శకుడు కాబట్టి ఆమెకు ప్లస్ అవుతుందని కూడా అనుకోలేం. ఆడియన్స్ ఫోకస్ పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది.

ఒక భాషలో ఆఫర్స్ లేకపోతే మరో భాషలో అడుగులు వేస్తారు హీరోయిన్లు. ఈ మేరకు శ్రీ లీల కూడా కోలీవుడ్ వైపు చూసింది. అక్కడ కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ.. ఏదీ కమిట్ కాలేదు. కాస్త లేట్ అయినా బంపర్ ఆఫర్ పట్టేసింది. ఆకాశం నీ హద్దురా అనే మూవీతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సుధా కొంగర దర్శకత్వంలో సినిమా చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి గతంలోనే వార్తలు వచ్చాయి. అప్పుడు హీరో శివకార్తికేయన్.. నిర్మాత సూర్య. బట్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మారిందట. బట్ హీరో మాత్రం శివకార్తికేయన్. శివకార్తికేయన్ అంటే కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరో. ఇక సుధ కొంగర చేతిలో పడిందంటే హీరోయిన్ కు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే ఉంటుంది. సో.. కోలీవుడ్ కు సంబంధంచి శ్రీ లీలకు ఇది పర్ఫెక్ట్ లాంచ్ అనే చెప్పాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News