Stree 2 : స్త్రీ-2 కలెక్షన్లలో ప్రభంజనం..రూ.300కోట్లు క్రాస్

శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో తెరకెక్కి ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన స్త్రీ2 మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. వారం రోజుల్లో 300 కోట్లను కలెక్ట్ చేసి కల్కి ఏడీ 2898ను వెనక్కి నెట్టేసింది. హిందీ డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయిన కల్కి ఏకంగా 293 కోట్ల కలెక్షన్స్ ని నార్త్ ఇండియాలో వసూళ్లు చేసింది. ఇవాళ్లితో కలుపుకొంటే 300 కోట్లు క్రాస్ అయినట్టే లెక్క. గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ని షారుఖ్ ఖాన్ తన పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో కాస్తా సేవ్ చేశాడు. ఈ ఏడాది స్త్రీ2 మూవీ హిందీ పరిశ్రమకి ఊపిరి పోసింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. శని, ఆదివారాలతో పాటు సోమవారం కృష్ణాష్టమి ఫెస్టివల్ కూడా నెక్స్ట్ స్త్రీ2 సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్త్రీ2 మూవీ 500-600 కోట్ల వరకు కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్ ని నిర్మాతకి అందించేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. స్త్రీ మూవీ లాంగ్ రన్ లో 180+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటే దానికి సీక్వెల్ గా వచ్చిన మూవీ మొదటి 8 రోజుల్లోనే 300 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఈ ఏడాది బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల జాబితాలో స్త్రీ2 మూవీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Aug 23, 2024 - 19:15
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News