సుప్రీంకోర్టు సీరియస్ నిందితులైతే ఇళ్లు కూల్చేస్తారా - బుల్‌డోజర్ యాక్షన్‌పై
సుప్రీంకోర్టు సీరియస్ నిందితులైతే ఇళ్లు కూల్చేస్తారా - బుల్‌డోజర్ యాక్షన్‌పై
సుప్రీంకోర్టు సీరియస్ నిందితులైతే ఇళ్లు కూల్చేస్తారా - బుల్‌డోజర్ యాక్షన్‌పై - బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటిని ఎలా బుల్డోజర్లతో కూల్చివేస్తారని కోర్టు ప్రశ్నించింది. పిటీషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దావే కోర్టులో వాదించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ చర్యలను ఆపాలని ఆయన ఆ పిటీషన్‌లో కోరారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు.
ఒక వ్యక్తి నేరంలో నిందితుడిగా ఉన్నంత మాత్రాన , అతని స్థిరాస్తిని నేలమట్టం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ఒకవేళ ఆ కట్టడం కనుక అక్రమం అయితే, అప్పుడు మాత్రమే దాన్ని కూల్చివేయడం జరుగుతుందని తుషార్ చెప్పారు. ఇలాంటి సందర్భంలో తాము కొన్ని మార్గదర్శకాలు ఇస్తామని, నిందితుడో లేక దోషి అయినంత మాత్రాన ఆ వ్యక్తి ఇంటిని ఎలా కూల్చుతారని జస్టిస్ గవాయి అడిగారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎందుకు సూచనలు చేయడం లేదని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. ముందు నోటీసు ఇవ్వాలని, రిప్లై ఇచ్చేందుకు టైం ఇవ్వాలని, కోర్టు ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత కూల్చివేత ప్రక్రియ చేపట్టాలని జస్టిస్ విశ్వనాథన్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను తమ ధర్మాసనం సమర్థించడం లేదని ఆయన అన్నారు. కానీ డెమోలిషన్‌కు మాత్రం మార్గదర్శకాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
What's Your Reaction?