Swag Teaser: శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ వచ్చేసింది
టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు కొన్నాళ్లుగా కామెడీ జానర్ తో విజయాలు సాధిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన రాజ రాజ చోర తర్వాత అదే దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్ లోనే ఇప్పుడు స్వాగ్ అనే మూవీతో వస్తున్నాడు. టైటిల్ నుంచి గ్లింప్స్ వరకూ వెరైటీగా ఉంది అనిపించుకున్న ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే మరోసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తోనే వస్తున్నారు అనిపిస్తోంది.‘వింజామర వంశ సామ్రాజ్యం.. మాతృస్వామ్య వ్వవస్థ’ కాలం అనే టైటిల్ తో కొన్ని శతాబ్దాల క్రితం మగవాడి ఉనికి సైతం చిగురుటాకుల్లా వణికిపోతున్న శకంలో అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్.. ఆ కాలాన్ని ప్రతిబింబిస్తూ.. హీరోయిన్ రీతూవర్మకు మగవాళ్లపై ఉన్న ద్వేషాన్ని చూపిస్తూ సాగుతుంది. మగవాళ్లను కాళ్లకిందే తొక్కి పెట్టాలనే మనస్తత్వం ఆమెది. ఆఖరికి మగ సంతానం కలిగినా చంపేందుకూ వెనకాడదు. అంత ద్వేషం మగవాళ్లంటే. ఈ వంశంలో ఇక మగపిల్లవాడు పుట్టడు.. కరిబిత్ కిరిబిత్ అనే శాపం శ్రీ విష్ణు నుంచే వినిపిస్తుంది. అక్కడి నుంచి వేరే గ్రహానికి, ఆ తర్వాత ఈ లోకానికి వస్తుంది. బట్ ఆ వంశంలో పుట్టిన మగపిల్లవాడి వెదుకులాట శతాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంటుంది. మరి అతని కొడుకు ఎవరనేది సినిమాలోనే చూడాలని చెప్పారు. స్వాగ్ లో శ్రీ విష్ణు .. సింగా, భవభూతి, యయాతి అనే భిన్నమైన పాత్రలు, భిన్నమైన ఆహార్యాల్లో కనిపిస్తున్నాడు. క్వాలిటీ పరంగా బావుంది. మేకింగ్ ఆకట్టుకుంటోంది. ఆడవాళ్ల ఆత్మ గౌరవం, మగవాళ్ల అహంకారం అనే పాయింట్స్ చుట్టూ అల్లుకున్న కామెడీ కథలా ఉంది. శ్రీ విష్ణుతో పాటు సునిల్, రితూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు కొన్నాళ్లుగా కామెడీ జానర్ తో విజయాలు సాధిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన రాజ రాజ చోర తర్వాత అదే దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్ లోనే ఇప్పుడు స్వాగ్ అనే మూవీతో వస్తున్నాడు. టైటిల్ నుంచి గ్లింప్స్ వరకూ వెరైటీగా ఉంది అనిపించుకున్న ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే మరోసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తోనే వస్తున్నారు అనిపిస్తోంది.
‘వింజామర వంశ సామ్రాజ్యం.. మాతృస్వామ్య వ్వవస్థ’ కాలం అనే టైటిల్ తో కొన్ని శతాబ్దాల క్రితం మగవాడి ఉనికి సైతం చిగురుటాకుల్లా వణికిపోతున్న శకంలో అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్.. ఆ కాలాన్ని ప్రతిబింబిస్తూ.. హీరోయిన్ రీతూవర్మకు మగవాళ్లపై ఉన్న ద్వేషాన్ని చూపిస్తూ సాగుతుంది. మగవాళ్లను కాళ్లకిందే తొక్కి పెట్టాలనే మనస్తత్వం ఆమెది. ఆఖరికి మగ సంతానం కలిగినా చంపేందుకూ వెనకాడదు. అంత ద్వేషం మగవాళ్లంటే. ఈ వంశంలో ఇక మగపిల్లవాడు పుట్టడు.. కరిబిత్ కిరిబిత్ అనే శాపం శ్రీ విష్ణు నుంచే వినిపిస్తుంది. అక్కడి నుంచి వేరే గ్రహానికి, ఆ తర్వాత ఈ లోకానికి వస్తుంది. బట్ ఆ వంశంలో పుట్టిన మగపిల్లవాడి వెదుకులాట శతాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంటుంది. మరి అతని కొడుకు ఎవరనేది సినిమాలోనే చూడాలని చెప్పారు.
స్వాగ్ లో శ్రీ విష్ణు .. సింగా, భవభూతి, యయాతి అనే భిన్నమైన పాత్రలు, భిన్నమైన ఆహార్యాల్లో కనిపిస్తున్నాడు. క్వాలిటీ పరంగా బావుంది. మేకింగ్ ఆకట్టుకుంటోంది. ఆడవాళ్ల ఆత్మ గౌరవం, మగవాళ్ల అహంకారం అనే పాయింట్స్ చుట్టూ అల్లుకున్న కామెడీ కథలా ఉంది.
శ్రీ విష్ణుతో పాటు సునిల్, రితూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
What's Your Reaction?