Taapsee Pannu : నేను పబ్లిక్ ప్రాపర్టీని కాదు : తాప్సి పన్ను

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ భామ తాప్సి పన్ను. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఇప్పుడుతెలుగులో సినిమాలు తగ్గించేసి పూర్తి ఫోకస్ ఆమె బాలీవుడ్ పైనే పెట్టింది. 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు తెగవైరల్ అవుతున్నాయి. 'నేను నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు .. రెండింటికీ చాలా తేడా ఉంది. ఇలా చెబితే తెరవెనుక ఉన్న మహిళలు అంగీకరించరు. నేను మొదట అమ్మాయిని. ఆ తర్వాత నటిని. నేను ఇలా అంటున్నానుని కొందరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావ్ అని కామెంట్స్ చెయ్యొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి' అని తెలిపింది తాప్సీ. కాగా ఈ అమ్మడు డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ న్ను ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Aug 27, 2024 - 17:58
 0  4

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News