TATA Cars : కార్ల అమ్మకాల్లో టాటా టాప్
దేశీయ కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ సత్తా చాటింది. గత కొంతకాలంగా అత్యధికంగా అమ్ముడుపోయే కారుగా ఉన్న మారుతీ సుజుకీ వేగనార్‌ను దాటేసింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో తొలి 7 నెలల్లో ఎక్కువ అమ్మకాలు నమోదుచేసిన మోడల్‌గా నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు నమోదైన అమ్మకాల ఆధారంగా ఆటోమార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ డేటా వెలువరించింది.గత ఏడు నెలల్లో టాటా పంచ్ 1.26 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. వేగనార్ 1.16 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుండాయ్ క్రెటా 1.09 లక్షలు, మారుతీ సుజుకీ బ్రెజ్జా 1.05 లక్షలు, మారుతీకే చెందిన ఎర్టిగా 1.04 లక్షల యూనిట్లు చొప్పున అమ్మకాలు నమోదయ్యాయి. అయితే, జులై నెల అమ్మకాల్లో మాత్రం టాటా పంచ్ నాలుగో స్థానానికి పడిపోయింది. హ్యుండాయ్‌కి చెందిన క్రెటా అగ్రస్థానంలో నిలిచింది.వేగనార్ అమ్మకాల రికార్డును టాటా మోటార్స్ దాటడం వెనక వివిధ కారణాలు ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎస్‌యూవీ ఫీచర్లను టాటా పంచ్ అందుబాటు ధరలో అందిస్తుండడమే దీనికి కారణమని ఎక్స్ పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు పలు రకాల ఇంధన ఆప్షన్లు ఉండడమూ మరో కారణమని పేర్కొంటున్నారు. టాటా పంచ్ సేల్స్‌లో 47 శాతం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్లే ఉన్నాయని, అత్యధికంగా అమ్ముడవుతున్న ఇతర కార్లలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ లేదా డీజిల్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వాహనదారులు కోరుకునే ఫ్యూయల్‌లో కారును అందించడం వెనక టాటా పంచ్ విజయం దాగి ఉందని పేర్కొంటున్నారు.

What's Your Reaction?