Teja Sajja : ఏప్రిల్ 18న తేజా సజ్జ మిరాయ్
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. తేజ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. 8 ఏళ్ల విరామం తర్వాత ఆయన ఈ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘‘మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దీని గురించి సినిమా విడుదల తర్వాత మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకొని సినిమా చేస్తున్నా. ‘హను-మాన్’కి ముందే ఈ కథని తేజకి చెప్పా. పదేళ్లుగా తనతో ప్రయాణం చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలుస్తున్నా’’ అని దర్శకుడు ఓ సందర్భంలో దీని గురించి చెప్పారు.

What's Your Reaction?