TG : కాంగ్రెస్ ప్రజాపాలన పెద్ద బోగస్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీకి గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) తెలిపారు. గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి ఆ ఘనత ఉండేదని.. 2014లోనే బీజేపీ దాన్ని వెనక్కి నెట్టిందన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్లో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించి రికార్డ్ నెలకొల్పిందన్నారు. 2014లో పార్టీలో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ జరిగిందని, పదేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చేపడుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అక్టోబరులో ప్రారంభం కానుందని.. తెలంగాణలో ఇప్పుడే మొదలుపెట్టామన్నారు. కొత్త సభ్యత్వ నమోదులో పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా మొదలు సభ్యులంతా పాత సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకుంటారన్నారు.సన్నాహక సమావేశాలు, వర్క్ షాపులతో పోలింగ్ బూత్ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టి వారిని పార్టీ సభ్యులుగా చేర్చుకుంటామన్నారు.‘ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో జనాలను మభ్యపెట్టింది. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ.. కాంగ్రెస్ ప్రజాపాలన రెండూ పెద్ద బోగస్. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరుపై విసిగిపోయారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

What's Your Reaction?