TG : కేటీఆర్ కు రేవంత్ ఝలక్.. సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం

సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్ర ఏర్పాటుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న అంశానికి సంబంధించి సచివాలయం ఆవరణ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రెండు దఫాలు కలియతిరిగారు. డిసెంబర్ 9న సచివాలయంలోపలే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం సోమాజిగూడలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ప్రకటించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయం చేరుకున్న ఆయన విగ్రహ ఏర్పాటు ఎక్కడైతే బాగుంటుందోనని ఆవరణ అంతా తిరిగి స్థలాన్ని ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. తిరిగి సాయంత్రం రెండో దఫా ఉప ముఖ్యమంత్రి భట్టిని వెంట బెట్టుకుని సచివాలయం చుట్టూ తిరిగి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని సీఎం రేవంత్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. విగ్రహ ఏర్పాటుకు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించిన సీఎం.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించినట్టు సమాచారం. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

Aug 23, 2024 - 11:18
 0  0
TG : కేటీఆర్ కు రేవంత్ ఝలక్.. సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం

సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్ర ఏర్పాటుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న అంశానికి సంబంధించి సచివాలయం ఆవరణ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రెండు దఫాలు కలియతిరిగారు. డిసెంబర్ 9న సచివాలయం

లోపలే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం సోమాజిగూడలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ప్రకటించారు.

అక్కడి నుంచి నేరుగా సచివాలయం చేరుకున్న ఆయన విగ్రహ ఏర్పాటు ఎక్కడైతే బాగుంటుందోనని ఆవరణ అంతా తిరిగి స్థలాన్ని ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. తిరిగి సాయంత్రం రెండో దఫా ఉప ముఖ్యమంత్రి భట్టిని వెంట బెట్టుకుని సచివాలయం చుట్టూ తిరిగి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని సీఎం రేవంత్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. విగ్రహ ఏర్పాటుకు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించిన సీఎం.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించినట్టు సమాచారం. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News