TG : తెలంగాణలో ఎల్లుండి వరకు భారీ వర్షాలు
ఉత్తర తెలంగాణలో ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఆ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి జల్లులు కురుస్తాయంది.

What's Your Reaction?