TG : 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం : మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్నా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇప్పటి వరకు 22 లక్షల రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందన్నారు. వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆశించామని చెప్పారు. రుణమాఫీ పొందలేని రైతులు.. వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలు, మండల ఆఫీసుల్లో అధికారులను పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు. రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని, పదేళ్ల పాటు అన్నదాతలను మోసం చేసిన పార్టీ ముసలి కన్నీరు కారుస్తోందని మంత్రి తుమ్మల మండిపడ్డారు. ‘నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన పార్టీ కూడా మాట్లాడుతోంది. అసత్యాలు చెప్పి రైతుల్లో ఆందోళన పెంచాలని చూస్తున్నారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. బ్యాంకులు, అధికారులు ఏమైనా తప్పు చేస్తే.. వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. 41 లక్షల 78 వేల 892 మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకులు చెప్పాయి. వారి బకాయిలు రూ.31వేల కోట్లు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఎక్కువగా రూ.2లక్షలలోపు రుణాలే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ పనులు చూసుకోవాలి’అని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్నా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇప్పటి వరకు 22 లక్షల రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందన్నారు. వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆశించామని చెప్పారు. రుణమాఫీ పొందలేని రైతులు.. వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలు, మండల ఆఫీసుల్లో అధికారులను పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు.
రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని, పదేళ్ల పాటు అన్నదాతలను మోసం చేసిన పార్టీ ముసలి కన్నీరు కారుస్తోందని మంత్రి తుమ్మల మండిపడ్డారు. ‘నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన పార్టీ కూడా మాట్లాడుతోంది. అసత్యాలు చెప్పి రైతుల్లో ఆందోళన పెంచాలని చూస్తున్నారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. బ్యాంకులు, అధికారులు ఏమైనా తప్పు చేస్తే.. వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. 41 లక్షల 78 వేల 892 మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకులు చెప్పాయి. వారి బకాయిలు రూ.31వేల కోట్లు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఎక్కువగా రూ.2లక్షలలోపు రుణాలే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ పనులు చూసుకోవాలి’అని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?