TG: కూల్చివేతలు కంటిన్యూ అవుతాయా?

అక్రమ కట్టడాలు ఎవరివైనా కూల్చేస్తారా... రేవంత్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

Aug 26, 2024 - 09:55
Aug 26, 2024 - 10:00
 0  2
TG: కూల్చివేతలు కంటిన్యూ అవుతాయా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుతో రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా పేరుతో రేవంత్‌ తీసుకున్న కీలక అడుగుతో నేతలు సతమతమవుతున్నారు. అక్రమ‌ కట్టడాల కూల్చివేత‌లు తీవ్ర రాజ‌కీయ ఒత్తిళ్లకు దారి తీసే చర్యలకు రేవంత్‌ పూనుకుంటున్నాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తు‌న్నారు. నాగార్జున ఎన్ క‌న్వెన్షన్‌ను నేల‌మ‌ట్టం చేసి ఎక్కడా ఆపేది లేదు. ఎవ‌రి మాటా విలేది లేద‌ని రేవంత్‌ స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా చెరువులు, నాలాలను ఆక్రమించింది తమ పార్టీ వారైనా ముందుకు వెళతామని ఖరకండిగా రేవంత్‌ తేల్చి చెప్పడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. బడా బాబులు ఉన్నా జాన్తానై అంటున్నాడు. ఈ చర్యలు ఏ మార్పులకు దారీ తీస్తయో వేచి చూడాల్సిందే.

ప్రతి పక్షాలు వేయి కళ్లతో చూస్తున్నాయి..

అక్రమ నిర్మాణాల‌ని మ‌న‌మే అంటున్నాం.. మ‌రి కూల్చి వేస్తే మంచిదేగా అంటారా..? అన‌డం సులువే. కానీ ఆచ‌ర‌ణ‌లో పెట్టేట‌ప్పుడే వ‌స్తుంది స‌మ‌స్య‌. దీన్నిఓవ‌ర్‌క‌మ్ చేశాడు రేవంత్‌రెడ్డి. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌లో నిర్మించిన ఫామ్‌హౌజ్‌లు, భారీ నిర్మాణాలు. వా టిని వ‌దిలితే వెయ్యి క‌ళ్లతో వాచ్ చేసే శ‌క్తులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. రేవంత్‌ను ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అన్ని పార్టీలు సైలెంట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నాగార్జున్ ఎన్ కన్వెన్ష‌న్‌ను కూల్చివేసిన‌ప్పుడు చాలా మంది మెచ్చుకున్నారు. శబాష్ సీఎం అన్నారు. పార్టీల‌క‌తీతంగా సంతోషించారు. ప్రజల నుంచి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం నుంచి ప్రభుత్వానికి మద్దతు లభిస్తోంది. కానీ మున్ముందు అక్రమ‌ నిర్మాణాల కూల్చివేత‌ల్లో ఇదే వేగం క‌న‌బ‌ర్చకపోతే ప్రజ‌ల ముందు ప్రభుత్వాన్ని, సీఎంను పెద్దల పక్షపాతిగా చూపేందుకు పార్టీలు ఎదురు చూస్తున్నాయి.

హైడ్రా స్పీడ్ కొనసాగుతుందా?

నాలాల మీద, చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాల లెక్కలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాదాపు 49, 600 అక్రమ క‌ట్టడాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవ‌న్నీ చేత‌గాక‌నే గ‌త ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింది. మ‌రి సీఎం రేవంత్రెడ్డి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడన్నదే బిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక్కడ సొంత పార్టీ నాయ‌కుల‌వీ ఉన్నాయి. మ‌రి అవ‌న్నీ కూల్చాల్సిందే. ఒక్క కేటీఆర్ మీద ప్రతీకారంగా దీన్ని చూస్తే విమ‌ర్శల పాల‌వుతాడు. ఇవ‌న్నింటికీ సమాధానంగా హైడ్రా స్పీడ్‌ను ఇదే విధంగా కొన‌సాగించ‌డ‌మే. హైడ్రాపై ఒత్తిడి తేకుండా స్వేచ్చగా దాని ప‌ని అది చేసుకునేలా చేయ‌డ‌మే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News