TG: హైడ్రా కూల్చివేతలతో ఎంఐఎం నేతల్లో వణుకు..?
ఒవైసీ ప్రెస్‌మీట్‌తో మరింత పెరిగిన రాజకీయ వేడి... రేవంత్ దూకుడు కొనసాగిస్తారన్న అంచనాలు
ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో చెరువులను, నాలాలను ఆక్రమించి కట్టుకున్న భవన యజమానుల వెన్నులో వణుకు పుడుతోంది. తాజాగా ఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైసీ హైడ్రాపై, ప్రభుత్వం విరుచుకుపడ్డారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారని, వాటిని కూడా కూల్చేస్తారా ప్రశ్నించారు. నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేది.. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటని అడిగారు. గోల్కొండలో కూడా గోల్ఫ్ కోర్టు ఉంది. ఇలా ఆయనకు తెలిసినా, చెరువులు, నాలాలపై కట్టిన ప్రభుత్వ కట్టడాల సమాచారన్ని ఏకరువు పెట్టారు. దీనికి కారణం లేకపోలేదు.
మజ్లిస్ ఎమ్మెల్యేను అరెస్టు చేసి, రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఓవైసీ బ్రదర్స్, ఆయన బంధువులు పాతబస్తీలో చెరువులను కబ్జా చేసిన వాళ్లలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆస్పత్రులు, కార్యాలయాలు చాలా వరకూ చెరువులు, నాలాలపై నిర్మించినవేనని తెలుస్తోంది. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కళాశాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కాలజీ గూగుల్ మ్యాప్ చూస్తే మజ్లిస్ కుటుంబం ఏ విధంగా చెరువును కబ్జా చేసిందో అర్థమవుతోందన పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దాన్ని కూల్చివేస్తారన్న అనుమానంతోనే ఓవైసీ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎలాంటి భవనాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఓవైసీకి కూడా వర్తిస్తాయని పలువురు నేతలు అంటున్నారు. సొంత పార్టీ నేతలైనా రేవంత్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. దూకుడుగా ముందుకు వెళుతున్నారు. రాజకీయంగా ప్రజలే అండగా ఉంటారని సీఎం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓవైసీ మీద ఆధారపడేం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఓవైసీ సన్నిహితంగా ఉంటారు. అయినా ఇలాంటి కబ్జాలను చూసీ చూడనట్లుగా ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదని చెబుతున్నారు. తాజాగా ఎంపీ అసదుద్దీన్ తమ్ముడు చాంద్రయణగుట్ట ఎమ్మెల్యే ఆక్బరుద్దీన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి భవనాలు 12 కట్టించానని. కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వీటిపై వక్రదృష్టి పెట్టారన్నారు. ఇవీ పేదల విద్యాభివృద్ధికి నిర్మించినవి వీటి జోలికి రావద్దని.... ఇలాంటి ఎత్తయిన భవనాలు మరిన్ని నిర్మిస్తామని కూడా తెలిపారు. మరి ఇప్పుడు ేవంత్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది.
What's Your Reaction?