TG : చెరువు కబ్జా చేసి అనురాగ్ వర్సిటీ నిర్మాణం.. పల్లాపై కేసు నమోదు
అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్వే నెంబర్ 813 లోని నాడెం చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆస్పత్రి నిర్మించారని నంగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేశ్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధి కారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పీఎస్‌లో అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు (ఎఫ్ఎఆర్ 390/2024) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్వే నెంబర్ 813 లోని నాడెం చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆస్పత్రి నిర్మించారని నంగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేశ్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధి కారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎవరూ స్పందించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పీఎస్‌లో అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు (ఎఫ్ఎఆర్ 390/2024) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
What's Your Reaction?