TG Waqf Borad | కేంద్రం చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్ బోర్డు
TG Waqf Borad | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు పేర్కొంది.
TG Waqf Borad | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు పేర్కొంది. రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో సోమవారం సమావేశమైంది. సమావేశంలో ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు బోర్డు సభ్యుల పాల్గొన్నారు. చట్ట సవరణ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ కమిటీని కలిసి బోర్డు అభిప్రాయం తెలపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాగే, బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన బోర్డుల చైర్మన్లు, సీఈవోలతో సమావేశం కావాలని నిర్ణయించామని ఒవైసీ పేర్కొంది. కేంద్రం తీసుకువచ్చిన అప్రజాస్వామిక వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరస్కరించిన మొదటి బోర్డు తెలంగాణ వక్ఫ్ బోర్డు అని ఒవైసీ తెలిపారు. బిల్లు తిరస్కరణకు మద్దతు ఇచ్చిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
What's Your Reaction?